For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఊసరవెల్లితో జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అలజడి మొదలైంది..!

  By Sindhu
  |

  జూ ఎన్టీఆర్, సురెంద‌ర్‌ రెడ్డిల కాంబినేష‌న్‌ లో రూపొందుతున్న చిత్రం ఊస‌ర‌వెల్లి. సినిమా స్టోరీలైన్ లీక్ అంయిదంటూ ఓ క‌థ ప్రచారం జ‌రుగుతోంది. ఈ మ‌ధ్య స్టార్ హీరోల చిత్రాల‌కి సంబంధించిన సమాచారం ఏమాత్రం లీక్ కాకుండా జాగ్రత్త పడ్డాకూడా ఎలాగో అలా లీకేజ్ మాత్రం అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా 'శక్తి", 'బద్రినాథ్" సినిమాల స్టోరీ లీక్ అయిన విషయం తెలిసిందే..ఆ లిస్ట్ లోకి జూ ఎన్టీఆర్ కూడా చేరుతోందిప్పుడు. ఈ లీకేజిల వ్యవహారం తెలుగులో జ‌ల్సా చిత్రం నుండి మొద‌ల‌యింద‌ని చెప్పొచ్చు. జ‌ల్సా చిత్రం విడుద‌ల‌కి ముందు కూడా జ‌ల్సా చిత్ర క‌థ లీకేజ్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా ఐన హిట్ అవ్వాలంటే మొదటగా రెండు జాగ్రత్తలు తీసుకొంటుంటారు దర్శక, నిర్మాతలు..ఒకటి సినిమాకి సంబందించిన స్టోరీ లీకేజ్ అవ్వడం, రెండోది పైరసీ..ఈ రెండింటినీ కంట్రోల్ చేయగలిగితే కొంచానికి కొంచెం అయినా సినిమాలు సక్సెస్ అవుతాయి..

  ప్రస్తుతం జూ ఎన్టీఆర్ నటిస్తున్న'ఊస‌ర‌వెళ్లి" చిత్ర స్టోరీ కూడా.. లీక్ అయిందని సమాచారం.. క‌థ ఏమిటంటే.. ఎన్టీఆర్ ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. హీరోయిన్ అదే సాఫ్ట్‌ వేర్ కంపెనీలో టీమ్ లీడ‌ర్‌. అనుకోకుండా హీరో ఓ మ‌ర్డర్‌ని చూస్తాడు.. దాంతో హీరోని చంప‌డానికి కొంద‌రు రౌడీలు వెతుకుతుంటారు. ఆ మ‌ర్డర్ గురించి తానెవ్వరికీ చెప్పన‌ని రౌడీల‌కి హీరో మాటిస్తాడు. కానీ హీరో కాకుండా ఆ మ‌ర్డర్ గురించి మ‌రెవ‌రో పోలీసుల‌కి ఇన్‌ ఫాం చేస్తారు.. అది హీరోనే చేసాడ‌ని రౌడీలు హీరోపై దాడి చేస్తారు.. ఆ దాడిలో హీరో త‌ల‌కి బ‌ల‌మైన దెబ్బ త‌గులుతుంది.. దాంతో హీరో హాస్పిటల్ లో చేరుతాడు..డాక్టర్లు హీరోకి మల్లిపుల్ పర్సనాలిటి డిస్ ఆర్డర్ వ్యాది వుందని దానివ‌ల్ల హీరోకి ఊసరివెల్లి లక్షణాలతో రాత్రి క‌ల‌లో ఏదైతే జ‌రుగుతుందో ప‌గ‌లు అలాగే ప్రవ‌ర్తించ‌డం మొద‌లు పెడ‌తాడు.. సింపుల్‌ గా ఇదీ 'ఊస‌ర‌వెల్లి" క‌థ‌.. ఇది నిజ‌మో కాదో తెలియ‌దు కానీ.. ఇదే ఊసరవెల్లి స్టోరి అంటూ బాగా పలు వెబ్ సైట్స్ లో చక్కర్లు కొడుతోంది.

  అయితే ఈస్టోరీ ఎప్పుడో ఎక్కడో విన్నట్లుందే అందే అంటూ ప్రేక్షకులల్లో అలజడి రేగుతోంది..విలక్షణ నటుడు విక్రమ్ నటించిన అపరిచితుడు" టైపులో హీరో పాత్రలు ఒకే విధంగా ఉన్నాయంటు అప్పుడే కంపేర్ చేయడం విమర్శించడం మొదలెట్టేశారు..సో ఇందులో ఎంతనిజం ఉందో తారక్ ఎలా చేశాడో చూడాలంటే ఊసరవెల్లి వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

  English summary
  Now, one film that is to join the list is ‘Oosaravelli’ of Jr Ntr in the direction of Surender Reddy. Though one can’t confirm this as original story of the film but this is what we hear from close sources to ‘Oosaravelli.’
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X