»   » అన్నీ తాత పోలికలే.. సిన్మాలు..రాజకీయాలు..ఆపై సీఎం!

అన్నీ తాత పోలికలే.. సిన్మాలు..రాజకీయాలు..ఆపై సీఎం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజకీయాల్లో నిలదొక్కుకోవాలనీ, పదవుల్లో కూర్చోవాలనీ తానెప్పుడూ అనుకోలేదని అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాతయ్య స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం గత ఎన్నికల్లో తాను ప్రచారం చేశాననీ, నందమూరి వారసుడిగా టీడీపీ వైభవం కోసం తాము కృషి చేస్తాను తప్ప, పార్టీ పదవులకోసమో, పగ్గాల కోసమో వెంపర్లాడనని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశాడు.

కాలం కలిసిరాక, మొన్నటి ఎన్నికల్లో ప్రచారాం మద్యలోనే ఆగిపోయిందనీ, తాతగారి మనవడిగా తనను ప్రజలు ఆదరించిన తీరు, నటుడిగానే కాదు, స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడిగా తన బాధ్యతను మరింత పెంచిందని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. టిడీపీ పగ్గాలు చేపట్టే అన్ని అర్హతలూ బాబాయ్ బాలయ్యకు వున్నాయన్న ఎన్టీఆర్, టీడిపిని ప్రస్తుతం చంద్రబాబు సమర్థవంతంగా నడిపిస్తున్నారని కితాబులిచ్చాడు.

పార్టీ ఎప్పుడు కోరినా పార్టీ కోసం పనిచేసేందుకు సిద్దమని, తెలుగు దేశం పార్టీ పేదల కోసమే పుట్టిన పార్టీ అని, అలాగే సేవా కార్యక్రమాల్లో నందమూరి అభిమానులు ఎప్పుడూ ముందుంటారని జూ ఎన్టీఆర్ పొలిటికల్ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు. మొన్నటి ఎన్నికల ప్రచారం తర్వాత టీడిపికి దూరంగా వుంటున్నానన్న వార్తల్లో నిజం లేదనీ, అవసరమైనప్పుడు ప్రచారం చేయడం మిగతా సమయాల్లో నటుడిగా సత్తా చాటుకోవడం..ఏపనికి ఆ పని సమర్థవంతంగా నిర్వర్తించడం తాతగారు చూపిన మార్గమేనని జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నాడు.

అయితే ఇదంతా చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్, తాత సీనియర్ ఎన్టీఆర్‌లా ముఖ్యమంత్రి కూడా అవుతారనేట్లుగా ఉందని కొందరు అనుకొంటున్నట్టు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu