»   » ఇక జూ ఎన్టీఆర్ సెలవు తీసుకుంటున్నారా?

ఇక జూ ఎన్టీఆర్ సెలవు తీసుకుంటున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తండ్రయిన సంగతి తెలిసిందే. మరో వైపు రభస షూటింగ్ కూడా పూర్తి అయింది. తండ్రి అయిన ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు జూ ఎన్టీఆర్ కొంత కాలం పాటు షూటింగులకు దూరంగా ఉండాలని, తన పనులకు సెలవు పెట్టి పూర్తిగా తన బుడ్డోడితోనే ఇంట్లోనే గడపాలని నిర్ణయించుకున్నాడట.

జూ ఎన్టీఆర్ ఇపుడు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే....చాలా కాలంగా చేయని పనులు కూడా ఇపుడు చేస్తున్నాడు. 2009లో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన జూ ఎన్టీఆర్.....2010లో నుండి దానికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత జూ ఎన్టీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేసారు. అందుకు కారణం జూ ఎన్టీఆర్ జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం కొడుకు పుట్టడమే.

Jr NTR on paternal leave

'చాలా కాలం నుండి ట్విట్టర్ కు దూరంగా ఉంటున్నా. కుమారుడు పుట్టిన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా ఈ రోజు మీతో పంచుకుంటున్నా. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేసాడు.

ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్ బో ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డను ప్రసవించింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ వార్తతో జూ ఎన్టీఆర్ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. 2011లో జూ ఎన్టీఆర్ వివాహం లక్ష్మి ప్రణతితో జరిగిన సంగతి తెలిసిందే.

English summary

 Film Nagar source said that, Jr.NTR can enjoy the paternal moments with his new born.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu