»   » అధ్బుత రీతిలో జూ ఎన్టీఆర్ పార్టీ?

అధ్బుత రీతిలో జూ ఎన్టీఆర్ పార్టీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ త్వరలో ఎవరూ ఊహించిని రీతిలో బ్యాచులర్ పార్టీ ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు ఆయన సన్నిహితులు ఏర్పాట్లు ప్రారంభించారని చెప్తున్నారు. ఈ పార్టీ సన్నిహితులైన అతి కొద్ది మందికి మాత్రమే నని, సినిమా వారిలో కూడా చాలా మందిన కూడా పిలవటం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. త్వరలో వివాహం చేసుకోనుండటంతో ఈ పార్టీని గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇందుకోసం వరల్డ్ క్లాస్ స్ధాయిలో మెనూ ఏర్పాటు చేస్తున్నారు. ఏది అడిగినా ఆ రాత్రి కాదనకుండా దొరికేలా వచ్చిన అతిధులందరికీ ఫైవ్ స్టార్ మర్యాదలు జరిగేలా ఎన్టీఆర్ భావించి చేస్తున్నారు. ఈ పార్టీకి వచ్చిన వారు తమ జీవితంలో మర్చిపోకూడని రీతిలో ఉండాలని ఎన్టీఆర్ పదే పదే హెచ్చరిస్తున్నారుట. డబ్బు విషయంలో వెనకడగు వేయవద్దని, ఆయన క్లోజ్ మిత్రుడుకి ఈ ఈవెంట్ ని పూర్తి స్ధాయిలో పర్యవేక్షించమని చెప్పారని వినికిడి. అయితే ఆ పార్టీ జరిగే వెన్యూ మాత్రం చివరి క్షణం వరకూ సీక్రెట్ గా ఉంచాలని, మీడియా కు అత్యంత దూరంగా ఉండాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu