»   » నెగిటివ్ పాత్రలో జూ. ఎన్టీఆర్ నెక్ట్స్

నెగిటివ్ పాత్రలో జూ. ఎన్టీఆర్ నెక్ట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టెంపర్ ఘన విజయం సాధించిన నేపధ్యంలో జూ.ఎన్టీఆర్ తదుపరి చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్...నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. టెంపర్ లోనూ నెగిటివ్ పాత్రలో తొలిసారి కనిపించి మెప్పించటంతో ఈ ధైర్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. నటనకు పూర్తి ప్రాధాన్యత ఉన్న చిత్రం ఇదని చెప్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మార్చి 1న ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని, హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయబోతుండటం విశేషం. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Jr NTR Playing A Negative Role In Sukumar's Film?

నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ... ఈ సినిమాకు అద్భుతమైన కథ కుదిరింది. సుకుమార్ శైలిలో సాగే కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఎన్టీఆర్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. ఆయన అభిమానులు కోరుకునే అంశాలన్నీ వుంటాయి. భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం అన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌లో వున్న పవర్‌ను ఆవిష్కరించే చిత్రమిది. ఆయనతో తొలిసారి పనిచేయడం ఆనందంగా వుంది. ప్రతీకార నేపథ్యంలో కథ వుంటుంది. ట్రీట్‌మెంట్ కొత్తగా వుంటుంది. స్టెలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల
ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు.

English summary
Jr NTR is on cloud nine with the success of Temper. He has played a negative character in the film for the first time and acquired much appreciation for his performance. Looks like he has taken it all a bit too seriously. According to the sources, NTR is again playing a role with grey shades in his next, with director Sukumar.
Please Wait while comments are loading...