»   » జూ ఎన్టీఆర్ అభిమానులకు అత్యాశే మిగుల్చుతాడేమో....

జూ ఎన్టీఆర్ అభిమానులకు అత్యాశే మిగుల్చుతాడేమో....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ అభిమానులైన ఇద్దరు పంపిణీదారులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి తన అభిమాన హీరో కొత్త సినిమా హక్కులని నాలుగు ఏరియాలకి ఫ్యాన్సీ రేటిచ్చి కొనేశారు. సినిమా ప్రారంభమయిన రోజే కష్టా, గుంటూరు, నెల్లూరు, ఓవర్సీస్ లాంటి మేజర్ ఏరియాస్ కి బిజినెస్ క్లోజ్ అవడం సినీ పరిశ్రమలో పెద్ద టాపిక్ అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతతోన్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అందుకే అంత మొత్తం పోసి హక్కులు కొన్నారు. అయితే ఈ కాంబినేషన్ మీద ఆశలు పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదనీ సినీ విశ్లేషకులు అంటున్నారు.

సురేందర్, జూ ఎన్టీఆర్ ల గత చిత్రం 'అశోక్" ఇచ్చిన షాక్ ని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు ఈ చిత్ర కథా రచయిత వక్కంతం వంశీకి కూడా అంత మంచి రికార్డేమీ లేదు. ఒక్క కిక్ తప్పించి ఇంతదాకా అతను రాసిన హిట్ మూవీ ఇంకోటేదీ లేదు. అతనిచ్చే కథలు, కత్తులు ఎలా ఉంటాయో తెలిసిన వాళ్లు కూడా ఈ చిత్రం పై అంచనాలు పెంచుకోవడం అత్యాశే అవుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిని నమ్ముకుని కోట్లు కుమ్మరించిన అభిమానులు మునిగిపోకుండా ఉంటే అదే చాలు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu