»   » జూ ఎన్టీఆర్ వివాహం 'లైవ్' అమ్మకానికి పెట్టారా?

జూ ఎన్టీఆర్ వివాహం 'లైవ్' అమ్మకానికి పెట్టారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ వివాహంని మా టీవీ ఛానెల్ వారు లైవ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లైవ్ సమయంలో రేటింగ్స్ విరరీతంగా రావటంతో ఇప్పుడు మిగతా స్టార్స్ వివాహం లైవ్ లు కూడా మంచి రేటు కి అమ్ముకోవచ్చనే ఆలోచన అందరిలో బయిలుదేరింది. త్వరలో కానున్న జూ.ఎన్టీఆర్ వివాహం లైవ్ కు కూడా మంచి రేటింగ్స్ వస్తాయని ఇప్పుడే పోటీ మొదలైంది. అయితే ఎన్టీఆర్ కాబోయే మామగారు నార్నే శ్రీనివాసరావుకి స్వంత ఛానెల్ స్టూడియో ఎన్ ఉండటంతో ఈ లైవ్ వారి ఛానెల్ లో నే వేస్తారనే అందరూ ఆసించారు. అయితే తమ ఛానెల్ కన్నా మా టీవీ కానీ, జెమినీ టీవీ కానీ అయితే ఎక్కువ మంది వీక్షించే అవకాశం ఉందని, అంతేగాక మంచి రేటు పలికే అవకాశం ఉందని వీరిలో ఒకరిని ఫిక్స్ చేసి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు నాగార్జున రికమెండేషన్ తో మా టీవీ వారు ఈ పోటీలో పాల్గొంటున్నారని, జెమినీవారు కేవలం తమ రేటింగ్ ని చూపి లైవ్ ఇమ్మంటున్నారని సమాచారం. మరి నార్నేశ్రీనివాసరావు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

English summary
It is heard that the Gemini TV channel and MAA channel are competing for rights of Jr NTR marriage Live from Studio N head Narne Srinivas. However, sources say Narne wants to make it live and get nice TRP for his channel. Apparently, he believes this will be a good marketing tool for his channel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu