»   » కన్ ఫ్యూజన్ లో ఉన్న డైరెక్టర్ కి చివాట్లు పెట్టిన జూ ఎన్టీఆర్...!?

కన్ ఫ్యూజన్ లో ఉన్న డైరెక్టర్ కి చివాట్లు పెట్టిన జూ ఎన్టీఆర్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు బోయపాటి శ్రీనుకి జూ ఎన్టీఆర్ చివాట్లెట్టాడట. తనతో చేయబోయే సినిమాకి సంబంధించి సబ్జెక్ట్ ఇంకా పక్కాగా ప్లాన్ చేయనందుకుగాను. అదేంటీ, ఆల్రెడీ సినిమా కూడా అనౌన్స్ అయిపోయింది కదా..అంటే, బోయపాటి పోరు పడలేక జూ ఎన్టీఆర్ సినిమాని అనౌన్స్ చేసేస్తే, ఇంకా సబ్జెక్ట్ మీద బోయపాటికి అస్సలు క్లారిటీ లేకుండా పోయిందట. 'సింహా" సినిమా తర్వాత సుమారు ఏడాది కాలంపాటు జూ ఎన్టీఆర్ చుట్టూ తిరిగి, ప్రాజెక్ట్ అయితే ఓకే చేసుకున్నాడుగానీ, తయారుచేసుకున్న స్క్రిప్ట్ మీద అస్సలు నమ్మకం లేకుండా పోయిందట బోయపాటికి.

ప్రస్తుతానికైతే కొన్ని సీన్లు రాసేసుకుని, వాటిల్లో మసాలా దట్టించేసి ఊరుకున్న బోయపాటి, కథ విషయంలో ఇంకా కన్ ఫ్యూజన్ లోనే వున్నాడని తెలిసి, జూ ఎన్టీఆర్ ఆ కథకు మెరుగులు దిద్దే పనిని, ఎవరికైనా అప్పజెప్పాలనే ఆలోచనలో వున్నట్టు సమాచారం. గతంలో 'ఒక్కమగాడు"సినిమాకి దర్శకుడు వైవీఎస్ చైదరీ ఇలానే బాలయ్యను నట్టేట ముంచేశాడనే విషయం ఇప్పటీ మర్చిపోలేని విషయం. అలాంటి ఖర్మ తనకు పట్టకూడానుకున్నాడో ఏమోగానీ, జూ ఎన్టీఆర్, బోయపాటి క్లాస్ పీకడమే కాదు, ఇంకో డైరెక్టర్ చేత బోయపాటి ప్రాజెక్ట్ లో కరెక్షన్స్ చేయించాలనుకుంటున్నాడు. మరి, జూ ఎన్టీఆర్ ప్రయత్నాలు వర్కవుట్ అవుతాయా? అసలు బోయపాటి -జూ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది?వేచి చూడాల్సిందే..

English summary
The success of films ‘Adurs’ and ‘Brindavanam’ given enough confidence to Jr.NTR that, he now is very sure about his upcoming movie ‘Shakti’ success. It is the same success story with director Boyapati Srinu who gave a hit film like ‘Simha’ with Balakrishna before closing of the year 2010.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu