»   » చిరంజీవి ‘ఇంద్ర’ని తలపిస్తోన్న జూ ఎన్టీఆర్ ‘శక్తి’...

చిరంజీవి ‘ఇంద్ర’ని తలపిస్తోన్న జూ ఎన్టీఆర్ ‘శక్తి’...

Posted By:
Subscribe to Filmibeat Telugu

వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా,నలక నడుము గోవా భామ ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, చలసాని అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రం 'శక్తి'. ఈ చిత్రానికి గతంలో బి.గోపాల్ దర్శకత్వంలో, మెగాస్టార్ హీరోగా నటించిన'ఇంద్ర'సినిమాకి పోస్టర్ లో కాస్తపోలిక కనిపిస్తుంది. దాంట్లో చిరంజీవి వెనక్కి వంగి ఆకాశంవైపు చూస్తూ రెండుచేతులూ విశాలంగా చాచి ఉంటాడు.

'శక్తి'పోస్టర్ ని మీరు గనక గమనిస్తే యన్ టి ఆర్ కూడా అలాగే వెనక్కి వంగి చేతులు చాచి ఆకాశం వైపే చూస్తూంటాడు. ఈ పోలిక కథా పరంగా ఎంత ఉంటుందో కానీ, ఒక్క పోస్టర్ పరంగానే ఉంది. రికార్డులన్నీ బద్దలు కొడుతుందని ఈ చిత్రం మీద యంగ్ టైగర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.ఈ సినిమా క్రికెట్ ప్రపంచ కప్ ముగిశాక మార్చిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu