»   » జూ ఎన్టీఆర్ 'శక్తి'పాటకి ట్యూన్స్ ఓ పాపులర్ సాంగ్ నుండి కాఫీ కొట్టారా...!

జూ ఎన్టీఆర్ 'శక్తి'పాటకి ట్యూన్స్ ఓ పాపులర్ సాంగ్ నుండి కాఫీ కొట్టారా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'సమ్మోహన సంగీత సంచలనం అంటూ ఇటీవల అంగరంగ వైభవంగా విడుదైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'శక్తి" ఆడియోకు మిశ్రమ స్సందన వస్తోంది. అయితే వీటిలో రెండు పాటలు మాత్రమే మళ్లీ మళ్లీ వినిపించేలా ఉంటే మిగతావి చిత్రీకరణను బట్టి చొచ్చుకుపోయే విధంగా ఉన్నాయి. కాగా ఈ రెండింటిలోనూ ఒక పాట బాలీవుడ్ హిట్ మూవీ అయిన 'దబాంగ్"లోని పాపులర్ ఐటమ్ సాంగ్ అయిన 'మున్నీ కా బద్నామీ" పాటకు కాపీగా అ(వి)నిపిస్తోంది.

'యమగా ఉందే నీ అందం ఎయిత్ వండర్ లా" అంటూ మొదలయ్యే ఆ పాటలో పాట ప్రారంభంలో వచ్చే మ్యూజిక్, 'నచ్చావే మాయాబజార్" అనే లైన్ల దగ్గర వచ్చే మ్యూజిక్..ఇవన్నీ వింటే మణిశర్మ మక్కీకి మక్కీగా 'దబాంగ్" ఐటమ్ పాటను వాడుకున్నాడా అనిపిస్తుంది. కాకపోతే ఈ పాటల రైట్స్ కి సంబంధించి ఇప్పటికే హెచ్చరిక ప్రకటన వచ్చింది. అది మణిశర్మ గమనించాడో లేదో లేక ఆ హెచ్చరిక ప్రకటన వచ్చేలోపు మణి ఆ ట్యూన్ ని వాడేసుకున్నాడో తెలియదు గానీ మొత్తానికి 'శక్తి"కి సంబంధించి సినిమాలో ఇంకెన్నీ కాపీలు కనిపిస్తాయో వేచి చూడాలి.

English summary
The music from Mani Sharma is just average but Junior NTR can make the songs look great with his dancing skills and 
 
 histrionics and adding to that, Meher Ramesh is really good at picturization of songs. So, if 'Shakti' becomes a Hit, then 
 
 the songs obviously will look great and the audio also becomes a super hit. But a good audio is something people 
 
 must like to listen to the songs irrespective of the result of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu