»   » జూ ఎన్టీఆర్ అందుకోసం సిక్స్ పాక్?

జూ ఎన్టీఆర్ అందుకోసం సిక్స్ పాక్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ కూడా సిక్స్ పాక్ తో కనిపించి అభిమానులను అలరించబోతున్నాడని వినపడుతోంది. వివివినాయిక్ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్న 'దానవీర సూర కర్ణ' రీమేక్ ప్రాజెక్టు కోసం ఎన్టీఆర్ తన శరీరాన్ని మార్చుకోబోతున్నారని చెప్పుకుంటున్నారు. అందుకోసం ప్రత్యేకమైన జిమ్ కోచ్ ని రప్పించి మరీ కృషి చేయటానికి నిర్ణయించుకుని సంప్రదింపులు జరుపుతున్నాడని సమాచారం. అందులో కర్ణ,ధుర్యోధన, కృష్ణ, బీమ పాత్రలను పోషించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ కావటానికి దాదాపు సంవత్సంరం పైనే పట్టే అవకాశం ఉంది. ఈలోగా వివివినాయిక్ తన తదుపరి చిత్రం గీతా ఆర్ట్స్ కు చేసి వస్తారు. అల్లు అర్జున్ హీరోగా చేసే 'బదిరీనాధ్' అది. అలాగే ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం జరుగుతున్న 'బృందావనం','శక్తి' చిత్రాలను ఫినిష్ చేసుకుని రెడీ అవుతారు. అందులోనూ రీసెంట్ గానే వివి వినాయిక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో 'అదుర్స్' రావటంతో కొంత గ్యాప్ తీసుకోదలిచారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu