»   » బన్నీని బీట్ అవుట్ చేయటానికేనా ఎన్టీఆర్ రోజుకు నాలుగు గంటలు

బన్నీని బీట్ అవుట్ చేయటానికేనా ఎన్టీఆర్ రోజుకు నాలుగు గంటలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ నటించిన బద్రీనాధ్ చిత్రం ఫ్లాప్ అయినా అందులోని డాన్స్ లకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఇన్నాళ్ళూ ఎన్టీఆర్ డాన్స్ లకు పెట్టింది పేరు అనుకున్నారు. చిరంజీవి తర్వాత ఎన్టీఆరే మంచి డాన్సర్ అన్న పేరు వచ్చింది. అయితే బన్నీ తాను తన మామయ్య చిరుని అనుకరిస్తూ డాన్స్ లు చేసానని చెప్పటం మొదలెట్టాడు. అంతేగాక డాన్స్ లు ఇరగదీసాడనే పేరు సైతం వచ్చింది. దాంతో ఎన్టీఆర్ రోజుకి నాలుగు గంటలు పాటు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని వినికిడి. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఊసరవిల్లి చిత్రం కోసం ఈ డాన్స్ లు చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో డాన్స్ లు స్పెషల్ గా మాట్లాడుకోవాలని ఎన్టీఆర్ ఆలోచన అని అందుకే శ్రమ పడుతున్నాడని చెప్తున్నారు. అంటే మనం త్వరలో ఎన్టీఆర్ నుంచి మరిన్ని మంచి డాన్స్ మూవ్ మెంట్స్ ని ఎక్సపెక్ట్ చేయవచ్చన్నమాట.

English summary
NTR is going to give some extra ordinary dance in his next film Oosaravalli- for this he is practicing 4 hours per day at home before going to shoot it seem.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu