»   » ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీలో ఎవరు పాల్గొన్నారు

ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీలో ఎవరు పాల్గొన్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్బంగా పెద్ద పార్టీనే ఎరేంజ్ చేసారు. అయితే ఈ పార్టీకి కేవలం తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను మాత్రమే కాకుండా కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్న దర్శకుడు పూరి జగన్నాధ్ ని, తనతో సినిమా చేస్తున్న దర్శకుడు కొరటాల శివ ని సైతం పిలిచారు. అంతేకాకుండా జనతా గ్యారేజ్ టెక్నీషియన్స్ అందిరినీ కూడా ఈ పార్టీకి ఇన్వేట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ పార్టీలో చాలాసేపు అన్నదమ్ములు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. అయితే వీళ్లిద్దరూ కలిసి పార్టీలకు, ఈవెంట్స్ కు వెళ్లటం మాత్రం జరుగుతూుంటుంది. కానీ ఇదే తొలిసారి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజుకు ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీ. దాంతో కళ్యాణ్ రామ్ మాత్రం చాలా చాలా ఆనందపడినట్లు తెలుస్తోంది.

kalyan-ntr

తమ సన్నిహితులంతా ఇలా ఒకచోట కూడి పార్టీ చేసుకోవటం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఎన్టీఆర్ చెప్పారట. ఇక కళ్యాణ్ రామ్ సైతం ఈ పార్టీలో తన సోదరుడుని అంటిపెట్టుుకనే ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ఏదైమైనా అన్నదమ్ముల అనుబంధం అలాంటిది మరి.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తాజా చిత్రం టీజర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజిసెస్ నుంచి ఫస్ట్ లుక్, టీజర్, విషయాల్లో కూడా రికార్డుల మీద రికార్డ్ లు నమోదవుతున్నాయి. జనతా గ్యారేజ్ తో రికార్డ్ ల వేట మొదలెట్టేశాడు ఎన్టీఆర్.

ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్, తాజాగా రిలీజ్ అయిన టీజర్ తో మరోసారి సత్తా చాటినట్లేంది. . 'బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ సమ్ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన ఓ బలవంతుడు ఉంటాడు. జనతా గ్యారేజ్ ఇచట అన్నీ రిపేర్ చేయబడును' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగు అభిమానులకు సంతోషాన్ని కలుగచేస్తోంది.

రికార్డ్ విషయానికి వస్తే..గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ రిలీజ్ అయిన సమయంలో 24 గంటల్లో 41 వేల లైక్స్ తో సత్తా చాటింది. అయితే ఎన్టీఆర్.. జనతా గ్యారేజ్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ కేవలం 100 నిమిషాల్లోనే 40 వేలకు పైగా లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ ను సాధించింది. అంతేకాదు 15 గంటల్లోనే 10 లక్షల పైగా వ్యూస్ సాధించింది జనతా గ్యారేజ్.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన సమంత నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు మళయాలంలోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

English summary
Nandamuri Kalyan Ram celebrated his birthday and Jr NTR threw a huge party for his brother. Koratala Siva and Puri Jagan also attended Kalyan Ram’s birthday party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu