»   » డైరెక్టర్ ని టార్చర్ పెడుతున్న జూ ఎన్టీఆర్..కారణం మెగా హీరోలు

డైరెక్టర్ ని టార్చర్ పెడుతున్న జూ ఎన్టీఆర్..కారణం మెగా హీరోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి కుటుంబానికి ఫేవరెట్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను మెగా ఫ్యామిలీతో రిలేషన్ కంటిన్యూ చేస్తూ, కనెక్షన్ కట్ కాకుండా ఎందుకు చూసుకుంటున్నాడు?ఓవైపు జూ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్దపడుతూ ఇంకోవైపు మెగా హీరోల వేడుకల్లో ఎందుకు పాల్గొంటున్నాడు? నందమూరి దర్శకుడనే ముద్ర చెరిపేసుకోవడానికనేది ఒక కారణమైతే, నందమూరి హీరోలతో ఇకపై సినిమాలు చేయరాదని నిర్ణయించుకోవడం మరో కారణమట. బాలకృష్ణతో 'సింహా" చేసిన తర్వాత మళ్లీ ఆయనని డైరెక్ట్ చేయమని అడిగితే ఒక అయిదారేళ్ల దాకా ఆయనతో సినిమా చేయనని, సింహాని మించే సినిమా చేయలేనని చెప్పి తప్పించుకున్నాడు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు రాజమౌళి, పూరి, వినాయక్ ల సరసన తన పేరు కూడా చేర్చి మాట్లాడుకోవాలంటే జూ ఎన్టీఆర్ తో సూపర్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. అయితే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి కమిట్ అయిన నాటి నుంచి జూ ఎన్టీఆర్ బోయపాటిని చాలా టార్చర్ పెట్టాడట. కథ నచ్చలేదని పదేపదే తిప్పి కొడుతూ చివరకు తనకు నచ్చిన వేరే రచయిత కథని డైరెక్ట్ చేయమని అప్పగించాడు. తీరా ఈ కథలో కూడా బోయపాటిని వేళ్లు పెట్టనివ్వడం లేదట. రాసింది తీస్తే చాలని అంటున్నాడట. ఒక పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని బోయపాటి చాలా ఫీలవుతున్నాడట.

శక్తి ఫ్లాప్ అయిన తర్వాత అయితే ఈ హింస మరింత ఎక్కువయిందని, హిట్ సినిమా తీయగలవా లేదా? వేరే డైరెక్టర్ తో చేసుకోనా? అంటూ ఎన్టీఆర్ పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటే, తనని జూ రిజెక్ట్ చేశాడనే ప్రచారం జరగడం ఇష్టం లేక ఇంకా ఆ సినిమాని పట్టుకు వేలాడుతున్నాడట. ఈ సినిమా రిజల్ట్ ఏమైనా కానీ బోయపాటికి చరణ్ లేదా అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశముందని ఖచ్చితమైన వాగ్ధానం లభించడంతో తన క్రెడిబులిటీ మరింత పెంచుకుని మెగా క్యాంప్ లోకి పూర్తిస్థాయిలో వెళ్లాలని బోయపాటి భావిస్తున్నాడట.

English summary
Jr Ntr have doubts on Boyapati Srinu, Boyapati Srinu to Direct Ram Charan Tej or Allu Arjun, Boyapati Srinu directing Ntr new movie,It was also said at that time, Ntr didn't like the story narrated by Boyapati. News is that, recently Ntr told people close to him "the story narrated by Boyapati is very good. I like it very much.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu