NTR30: సరికొత్త ప్లాన్ రెడీ చేసుకున్న మాటల మాంత్రికుడు.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విదంగా ఈ స్టార్ హీరోకు వెండితెరకు గ్యాప్ చాలానే వచ్చింది. అరవింద సమేత అనంతరం రాజమౌళి సినిమాతో బిజీగా ఉండడం వలన మరో ప్రాజెక్టును ముట్టుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ మరో ప్లాన్ సెట్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది.

రిలీజ్ టార్గెట్..

రిలీజ్ టార్గెట్..

త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రెండో సినిమా సెట్టయ్యి దాదాపు ఏడాది కావొస్తోంది. మధ్యమధ్యలో RRR సినిమాకు బ్రేకులు రావడం వలన కూడా ప్రాజెక్టు లాంచ్ అవ్వడానికి లేటయ్యింది. ఇక ఫైనల్ గా ఇటీవల సినిమా షూటింగ్ డేట్ తో పాటు రిలీజ్ టార్గెట్ ను కూడా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మధ్యలో రియాలిటీ షోతో..

మధ్యలో రియాలిటీ షోతో..


ఆడియెన్స్ కు గ్యాప్ ఇచ్చి చాలా రోజులు కావడంతో మొత్తానికి ఒక టీవీ షో ద్వారా తారక్ మళ్ళీ బుల్లితెర ద్వారా అభిమానులకు దగ్గర కాబోతున్నాడు. బిగ్ బాస్ లాంటి షో తరువాత తారక్ ఎవరు మీలో కోటీశ్వరుడు అనే రియాలిటీ షోతో సరికొత్తగా ఆకట్టుకోబోతున్నాడు. త్వరలోనే ఈ షో జెమిని టీవీలో స్టార్ట్ కాబోతోంది.

 లాంచ్ డేట్ ఫిక్స్

లాంచ్ డేట్ ఫిక్స్

ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది అనే ఊహాగానాలకు త్వరలోనే ముగింపు పలకనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును వచ్చే నెల ఏప్రిల్ 13న లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కూడా వీలైనంత తొందరగా స్టార్ట్ చేసి ఇదే ఏడాది డిసెంబర్ లోగా పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్.

రిలీజ్ డేట్ కూడా..

రిలీజ్ డేట్ కూడా..


ఇక సినిమా విడుదలపై కూడా త్రివిక్రమ్ ఒక ప్లాన్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. మళ్ళీ రిలీజ్ డేట్ దొరకడం కష్టమవుతుందని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సంక్రాంతికి మహేష్, పవన్ సినిమాలు రాబోతున్నాయి కాబట్టి సమ్మర్ లోనే ఎన్టీఆర్ 30వచ్చే ఛాన్స్ ఉందట. కుదిరితే 2022 ఏప్రిల్ 19న సినిమాను రిలీజ్ చేయవచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X