»   » 'అదుర్స్' ను 100 డేస్ ఆడించాలని జూ ఎన్టీఆర్ బెదిరింపులు!

'అదుర్స్' ను 100 డేస్ ఆడించాలని జూ ఎన్టీఆర్ బెదిరింపులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబాయి మాఫియా నుంచి బాలీవుడ్ నటీనటులకు బెదిరింపు కాల్స్ వస్తాయని విన్నాం. మావోయిస్ట్ ల నుంచి జమీందారులకు బెదిరింపు కాల్స్ వస్తాయని పేపర్లో చదివాం. శత్రువుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం కామన్. కానీ జూ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తే అది పెద్ద వార్తే అవుతుంది.

విషయంఏమిటంటే 'అదుర్స్" సమర్సకుడు కొడాలి నాని పుణ్యమా అని రిలీజైన 20 రోజులకే సినిమాపై వేడి చల్లారింది. కలెక్షన్లు తగ్గాయి (లేదంటే నిలబడేదేమో). మొత్తమ్మీద 150 సెంటర్లలో 50 రోజులు (ఆంధ్ర, సీడెడ్) పూర్తిచేసుకుంది. నాని గొడవతో తెలంగాణాలో అదుర్స్ ను ఆపేసిన సంగతి తెలిసిందే. సినిమాను ఎలాగోలాగు వంద రోజులు ఆడించాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లపై ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ప్రెషర్ వస్తోందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఒకవేళ ఆడించడం కష్టమంటే ..ఫోన్ లో బెదిరిస్తున్నారట! చిత్ర నిర్మాత వల్లభనేని వంశీ..సమర్పకుడు.

కొడాలి నాని తెరవెనకుండి ఇదంతా చేయిస్తున్నారా లేదా ఎన్టీఆరే ఒత్తిడి చేసి ఏదో రకంగా వంద రోజులు ఆడే దిశగా పావులు కదుపుతున్నాడా అంటే చెప్పడం కష్టం. ఎన్టీఆర్ ఆఫీసులో ఉండే ఆయన అనుచరులే ఇదంతా చేస్తున్నారని ఓ ఎగ్జిబిటర్ ఆరోపించారు. ఎన్టీఆర్, నానికి తెలియకుండా వాళ్ల అనుచరులు బెదిరించే సాహసం చేయరు. మొత్తానికి బెదిరింపు కాల్స్ తో చెడు సంప్రదాయానికి ఆజ్యం పోశారు. ఈ సినిమా బాగుంటే వంద రోజులేం కర్మ సిల్వర్ జూబ్టీ ఆడిస్తారు ప్రేక్షకులు. అలాంటి ప్రేక్షకుల్ని నమ్ముకుని సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్ సినిమాలొస్తాయి. రౌడీయిజాన్ని గూండాగిరిని నమ్ముకుంటే..కాంట్రవర్సీలే మిగుల్తాయి. ఉన్న పరువు కాస్తా 'బెదుర్స్" అవుతుంది. సో బి కేర్ ఫుల్ జూనియర్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu