»   » జూ ఎన్టీఆర్ అందుకే ఫ్రీగా చేయటానికి కమిటయ్యాడా?

జూ ఎన్టీఆర్ అందుకే ఫ్రీగా చేయటానికి కమిటయ్యాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేష్ లో వచ్చిన శక్తి చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకన్న సంగతి తెలిసిందే. అశ్వనీదత్ ఎంతో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.కేవలం ఎన్టీఆర్ ఇమేజ్ మీద ఉన్న నమ్మకంతోనే ఆ పెట్టుబడి పెట్టారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు ఎన్టీఆర్ ఆయనకు ప్రీగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆంధ్రావాలా చిత్రం ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ నిర్మాతకు నా అల్లుడు చిత్రం చేసి ఇచ్చారు. అలాగే ఇప్పుడు శక్తి ఫెయిల్యూర్ కి మరో చిత్రం ఇస్తాడని చెప్తున్నారు. అలాగే అశ్వనీదత్ ని నమ్ముకుని డిస్ట్రిబ్యూట్ చేసిన పంపిణీదారుల కోసమైనా సినిమా చేయకతప్పదని, వారంతా శక్తి దెబ్బకు శక్తి హీనులయ్యారని అంటున్నారు.

ఇక ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. అయితే ఈ మద్యనే తమిళంలో కో అనే చిత్రం తీసి సూపర్ హిట్ ఇచ్చిన కెవి ఆనంద్ ని దర్శకుడుగా ఎంచుకున్నట్లు మరో వార్త వినపడుతోంది..ఆయన డైరక్టర్ గా మారి చేసిన రెండు చిత్రాలు రంగం, వీదొక్కడే తెలుగులో విడుదయ్యాయి కానీ వర్కవుట్ కాలేదు. అయితే ఆయన చెప్పిన స్టోరీ లైన్ ఎన్టీఆర్ కి నచ్చటంతో వెంటనే ఓకే చేసి పూర్తి స్క్రిప్టుతో కలవమని చెప్పాడుట. ప్రస్తుతం ఎన్టీఆర్..ఊసరవిల్లి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే కెవి ఆనంద్ కూడా సూర్య హీరోగా చేస్తున్న చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

English summary
Tollywood leading producer Ashwini Dutt who made high budget film Shakti with NTR.Jr faced huge financial loss with the film big disaster at the box office. The latest news heard film nagar circles is that NTR.Jr has given green signal to Ashwini Dutt that he would do a film for him for free- without charging fees for acting in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu