లేటెస్ట్ న్యూస్: నెగిటివ్ రోల్ లో జూనియర్ ఎన్టీఆర్
జనతా గ్యారేజ్ తర్వాత తదుపరి చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషిస్తున్నట్టు సమాచారం.
జనతా గ్యారేజ్ చిత్ర విజయంతో మంచి జోష్ మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టు ఫిల్మ్ నగర్ లో రూమర్ వైరల్ గా మారింది. యువ హీరోల్లో ఎవరూ అటెంప్ట్ చేయని విధంగా త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు ఓ వార్త ఫిలిం సర్కిల్ లో జోరుగా ప్రచారం అవుతున్నది. మూడు పాత్రలో ఒకటి పవర్ ఫుల్ విలనిజాన్ని ప్రదర్శించే క్యారెక్టర్ ఒకటని చెప్పుకొంటున్నారు.

ఆదుర్స్ చిత్రంలో మాదిరిగా ఆచారి పాత్రను, మరో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ను కూడా జూనియర్ ఎన్టీఆర్ పోషిస్టున్నట్టు సమాచారం. అయితే దీనిని అధికారికంగా జూనియర్ ధృవీకరిస్తేనే తప్ప ఈ వార్త రూమర్ కాదని తేలుతుంది. అప్పటివరకు అభిమానులు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











