»   » జై లవకుశలో మూడు పాత్రలు కాదట.. నాలుగో పాత్రలో అదరగొట్టిన ఎన్టీఆర్!

జై లవకుశలో మూడు పాత్రలు కాదట.. నాలుగో పాత్రలో అదరగొట్టిన ఎన్టీఆర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం జై లవకుశ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మితమైన ఈ చిత్రానికి దర్శకుడు బాబీ. అయితే ఈ సినిమా సెట్స్ లో బాబీ నామమాత్రపు పాత్ర పోషించాడని సమాచారం. సెట్స్‌లో చిత్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అన్నతమ్ములు తారక్, కళ్యాణ్ రామ్ లే చూసుకున్నారని తెలిసింది.

జూనియర్ ఎన్టీఆర్ కనుసన్నల్లోనే

జూనియర్ ఎన్టీఆర్ కనుసన్నల్లోనే

జైలవకుశ చిత్రానికి కథ బాబీ అందించగా... స్క్రీన్ ప్లే కోన వెంకట్ సమకూర్చారు. కాగా ఈ చిత్రానికి మిగతా ప్లానింగ్ అంతా జూనియర్ ఎన్టీఆర్ కనుసన్నల్లోనే సాగిందని ఫిలింనగర్ వర్గాల కథనం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ యంగ్ స్టార్ట్స్ లో బెస్ట్ ఫెర్ఫార్మర్ గా పేరున్న ఎన్టీఆర్... ఈ చిత్రంలోని మూడు పాత్రలకు ఎన్టీఆర్ జీవం పోసినట్లు నటించాడట.

NTR Is Playing Directer's Role In Jai Lava Kusa
చిత్ర పనుల్లో లీనమైన ...

చిత్ర పనుల్లో లీనమైన ...

అయితే జై లవకుశ చిత్ర దర్శకుడి పాత్రను దాదాపు ఎన్టీఆర్ తీసుకోవడంతో ఈ చిత్రం విడుదలైన తర్వాత వచ్చే ఫలితానికి కూడా తానే బాధ్యత వహించేంతంగా ... చిత్ర పనుల్లో లీనమైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కెమెరా వెనుక కూడా ఎన్టీఆర్...

కెమెరా వెనుక కూడా ఎన్టీఆర్...

కెమెరా ముందే కాకుండా... కెమెరా వెనుక కూడా ఎన్టీఆర్ తన ప్రతాపం చూపించాడని తెలుస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించి గ్రాఫిక్ వర్క్ చాలా కీలకంగా మారింది. ఈ విభాగంలో కూడా ఎన్టీఆర్ అన్ని తానై వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎన్టీఆర్ ఈ చిత్రంలో మూడు పాత్రలకే పరిమితం కాకుండా దర్శకత్వం పరంగా నాలుగో పాత్రను కూడా పోషించారని.. ఫిలిం వర్గాలు పేర్కొంటున్నాయి.

సైడ్ చేశారని...

సైడ్ చేశారని...

ఇకపోతే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం చూస్తున్న బాబీ, హిట్ టాక్ వచ్చినా తన అకౌంట్‌లోకి రానంతగా తనను సైడ్ చేశారని వాపోతున్నట్లు ఫిలింనగర్ లో అంతర్గతంగా ఈ టాక్ వినిపిస్తోంది. అయితే ఏది ఏమీ అయినప్పటికీ జై లవకుశ హిట్ సాధిస్తే... ఆ క్రెడిట్ బాబీ ఖాతాలోనే పడుతుందిగా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

సెప్టెంబర్ 21 న విడుదలకు ..

సెప్టెంబర్ 21 న విడుదలకు ..

ఇటీవలే ఆడియో ఆవిష్కరణను జరుపుకుని ఈ నెల 10న ప్రీ రిలిజ్ ఫంక్షన్ జరుపుకోవడానికి జై లవకుశ సిద్ధమవుతోంది. ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 21 న విడుదలకు ముస్తాబవుతున్నది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సక్సెస్ లతో ఎన్టీఆర్ జోరు మీదున్నారు. ఒక వేళ జై లవకుశ విజయం సాధిస్తే... ఎన్టీఆర్ కు మరో విజయం సొంతమైనట్లే.

English summary
NTR's latest movie is slated for release on september 21st. mean while there is a rumour that NTR pokes his nose into direction side also. Bobby role for this movie becomes limited. In this movie NTR is Playing three roles as Jai, Lava, Kusha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu