twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌కు అది సరైన గుణపాఠం.. మరో 15 ఏళ్లు ఆ మాటే వద్దు..

    By Rajababu
    |

    తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు, సినిమాలకు ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉన్నది తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంతో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారంతో బలపడిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఒంటరిగా మారింది. ఈ నేపథ్యంలో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దించే ప్రయత్నం టీడీపీ వర్గాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానిపై ఎన్టీఆర్ పూర్తిగా క్లారిటీ ఇచ్చినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అవేమిటంటే..

    రాజకీయాలపై ఆసక్తిలేదు

    రాజకీయాలపై ఆసక్తిలేదు

    ఎన్టీఆర్ సన్నిహితులు వెల్లడించిన ప్రకారం.. తారక్‌కు ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తి లేదు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఎవరూ సంప్రదించలేదు. మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలే అని చెప్పారు.

    15 ఏళ్లు ఆ మాట ఎత్తకుండా

    15 ఏళ్లు ఆ మాట ఎత్తకుండా

    రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నాడు. ప్రస్తుతం తారక్ దృష్టి అంతా సినిమాలపైనే. మరో 15 ఏళ్లు రాజకీయాల వైపు చూడవద్దని అనుకొంటున్నారు అని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.

    గుణపాఠం నేర్చుకొన్నారు..

    గుణపాఠం నేర్చుకొన్నారు..

    పదేళ్ల క్రితం తారక్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అప్పుడు ఆయనకు ఏమీ తెలియదు. కొన్ని గుణపాఠాలు నేర్చుకొన్న తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకొంటున్నారు అని చెప్పారు.

    కల్యాణ్‌రాంపై సందేహాలు

    కల్యాణ్‌రాంపై సందేహాలు

    కాగా, తారక్ సోదరుడు, నిర్మాత, నటుడు కల్యాణ్ రామ్‌ ప్రస్తుతం ఎమ్మెల్యే అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాజకీయాలకు కొంత ప్రాధాన్యం ఉన్నది. దీంతో ఎన్నికల ముందు రాజకీయ చిత్రాన్ని రూపొందించడంపై కల్యాణ్ రామ్‌పై కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి.

    సినిమాలో భాగంగానే..

    సినిమాలో భాగంగానే..

    ఇటీవల మీడియా అడిగిన ఓ ప్రశ్నకు కల్యాణ్ రామ్ సమాధానం ఇస్తూ.. నాకు పాలిటిక్స్‌లోకి రావాలని ఏ మాత్రం ఆసక్తి లేదు. వాటిపై అంతగా అవగాహన కూడా లేదు. ఎమ్మెల్యే సినిమాలోని సన్నివేశాలకు అనుగుణంగా మాత్రమే నేను రాజకీయ పరమైన డైలాగ్స్ చెప్పాల్సి వచ్చింది అని కల్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు.

    English summary
    Recent times, Jr NTR’s name is once again clubbed with presen day politics. Reports suggest than Telugu Desam Party may rope him in as their campaigner for the coming elections. However, a source close to the actor says that Jr NTR is not interested in politics. Tarak may not talk about politics for the next 15 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X