»   » కె.విశ్వనాధ్ 'సుమధురం' చిత్రం పాయింట్...

కె.విశ్వనాధ్ 'సుమధురం' చిత్రం పాయింట్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కె.విశ్వనాధ్, అల్లరి నరేష్ ల కాంబినేషన్లో రెడీ అవుతున్న సుమధురం చిత్రం యాసిడ్ ఎటాక్స్ ప్రధానాంశంగా తీసుకుని రూపొందిస్తున్నట్లు సమాచారం. కథ ప్రకారం హీరోయిన్ పై యాసిడ్ ఎటాక్ జరుగుతుందని, తదనంతరం తన తప్పు లేకుండా జరిగిన దాడిని ఆమె ఎలా ప్రతిఘటించింది, హీరో దానికి ఎలా స్పందిచాడు, ఆ పరిణామాలు ఏమిటీ అని సమకాలీన సమాజం నేపధ్యంలో ఈ కథను తీస్తున్నట్లు వినపడుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మంజరీ ఫెడ్నిస్ చేస్తోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం విజయనగరం శివార్లలోని ఓ పెద్ద బంగ్లాలో దాదాపు ముప్పై ఐదు మంది ఆర్టిస్టులతో ఈ చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. మే 28న ఆడియో పంక్షన్ జరపాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu