»   » ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ రియాల్టీ షోలో కెఏ పాల్?

ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ రియాల్టీ షోలో కెఏ పాల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్రైస్తవ మత ప్రచారకుడు, పలు సందర్భాల్లో వివాదాలతో వార్తలో నిలిచిన కెఏ పాల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. త్వరలో తెలుగులో ప్రారంభం కాబోతున్న 'బిగ్ బాస్' రియాల్టీ షోలో కెఏ పాల్ కంటెస్టెంట్‍‌గా పాల్గొనబోతున్నట్లు సమాచారం.

గతంలో కెఏ పాల్ మీడియా ఇంటర్వ్యూలు చూసిన వారెవరికైనా ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి 'బిగ్ బాస్' లాంటి రియాల్టీ షోలో పాల్గొంటే ప్రేక్షకులకు బోలెడు ఎంటర్టెన్మెంట్. అందుకే ఎలాగైనా ఆయన్ను ఒప్పించేందుకు స్టార్ మాటీవీ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కెఏ పాల్

కెఏ పాల్

అయితే కెఏ పాల్ ‘బిగ్ బాస్'లో పాల్గొనేందుకు ఒప్పుకున్నారా? ఫైనల్ అయ్యారా? అనే విషయం ఇంకా అఫీషియల్‌గా అయితే ఖరారు కాలేదు. మొత్తం 12 మంది పోటీ దారులు ఫైనలైజ్ అయిన తర్వాత వారి వివరాలు అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ హోస్ట్

ఎన్టీఆర్ హోస్ట్

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్' రియాల్టీ షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ‘బిగ్ బాస్' లో సల్మాన్ ఖాన్ మాదిరిగా తెలుగు ‘బిగ్ బాస్' కార్యక్రమాన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నారు.

పోసాని

పోసాని

కొన్ని రోజుల క్రితం ‘బిగ్ బాస్' షోలో పోసాని కృష్ణ మురళి పాల్గొనబోతున్నారని, ఆయనకు షో నిర్వాహకులు రూ. 2.5 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, ఆ వార్తలన్నీ అబద్దాలే అని, తనను ‘బిగ్ బాస్' షో విషయంలో ఎవరూ సంప్రదించలేదని పోసాని స్పష్టం చేశారు.

సర్వత్రా ఆసక్తి

‘బిగ్ బాస్' రియాల్టీ షో.... ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని ఒక సరికొత్త ఎంటర్టెన్మెంట్ రియాల్టీ షో కావడంతో.... ఈ షో ఎలా సాగబోతోంది? ఎవరెవరు పాల్గొంటారు? అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

English summary
All eyes are on NTR's maiden TV show 'Big Boss' that is to be telecast on Star Maa shortly. Recently names like Posani Krishna Murali and actress Hema are discussed. Latest name that is being heard is K A Paul, the most popular reverend in Andhra Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu