»   » నాటకాలే నా కెరీర్ కి ప్లస్ పాయింట్: కాజల్ అగర్వాల్

నాటకాలే నా కెరీర్ కి ప్లస్ పాయింట్: కాజల్ అగర్వాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మగధీర" చిత్రంలో తన అభినయంతో అందరి దష్టిని తనవైపుకు మళ్లించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. లక్ష్మీకళ్యాణం, చందమామ చిత్రాల్లో పదహారణాల పల్లెటూరి మ్మాయిగా కనిపించినా..'మగధీర" లో ఇందుగా మోడ్రన్ కథానాయికగా అలరించినా..అదే చిత్రంలో 'మిత్రవింద" యువరాణిగా నటించినా అది ఆమెకే చెల్లింది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగల నాయిక కాజల్ ఎటువంటి పాత్రలోనైనా మంచి హావభావాలు పలికిస్తున్న ఈ బామ దగ్గర ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయం గురించి ప్రస్తావించినప్పుడు 'నేను బేసిక్ గా థియేటర్ ఆర్టిస్ట్ ని. చిన్నప్పటి నుంచీ నాటకాలు వేయడం అంటే చాలా ఇష్టం.

స్కూల్లో నిర్వహించే ప్రతి నాటకంలో ఉండేదాన్ని, అన్ని కార్యక్రమాల్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో పాల్గొనేదాన్ని నా నటన చూసి అందరూ తెగ పొగిడేవారు. ఆధునిక నత్యాల్లో కూడా మంచి ప్రవేశం వుంది. కాలేజీ స్థాయిలో చాలా ప్రదర్శనలిచ్చాను. ఏ కాలేజీలో పోటీ జరిగినా బహుమతి నాదే. డిగ్రీలో మా కళాశాల ఉత్సవం 'వోగ్" లో నేను క్యాట్ వాక్ చేస్తుంటే అందరి దష్టి నా వైపే. ఇక వారి ఉత్సాహం, ఆనందం చప్పట్ల రూపంలో తెలిపేవారు. ఈ నాటక అనుభవమే నాకిప్పుడు కెరీర్ కు చాలా ఉపయోగపడుతోంది. అంతే తప్ప నటనలో నేను ఎక్కడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు" అంటూ తన అభినయ రహస్యాన్ని చెప్పుకొచ్చారు పసిడి బొమ్మ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu