»   » ధృవ స్పెషల్ సాంగ్ లో కాజల్..., చరణ్ కోసమేనా... అవకాశాలు తగ్గాయనా..??

ధృవ స్పెషల్ సాంగ్ లో కాజల్..., చరణ్ కోసమేనా... అవకాశాలు తగ్గాయనా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెండితెరపై కొన్ని జంటలు చూడముచ్చటగా ఉంటాయి. ఎన్నిసార్లు కలిసి నటించినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అలాంటి జంటే కాజల్ -రామ్ చరణ్. వీళ్లిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. మగధీర వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు.

ఇటీవల కాజల్ తెలుగులో నటించిన "సర్దార్ గబ్బర్ సింగ్" .. "బ్రహ్మోత్సవం" చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఇక ఇప్పట్లో తెలుగు తెరపై కాజల్ కనిపించడం కష్టమేనని అనుకున్నారు. కానీ పెద్ద గ్యాప్ తీసుకోకుండానే ఆమె చరణ్ తో కలిసి సందడి చేయబోతోంది .. అదీ 'ధ్రువ' సినిమాలో. చరణ్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో చిందులేయనుందట కాజల్ అగర్వాల్

ram-kajal

ఈ మధ్య బాలీవుడ్ లో చేసిన "దో లఫ్జోన్ కి కహానీ" కూడా కాజల్ కి తీవ్ర నిరాసనే ఇచ్చింది. ఇప్పుడు కాజల్ కెరీర్ కి ఒక హిట్ అత్యంత అవసరం. అందుకే ఇప్పుడు చేయ బోయే సాంగ్ తో మళ్ళీ టాలీవుడ్ లో తన కెరీర్ని నిలబెట్టుకోవాలనుకుంటోందట ఈ చందమామ పిల్ల. అందుకే ధృవ లో స్పెషల్ సాంగ్ అనగానే ఏం మాట్లాడకుందా ఒప్పేసుకుందత కాజల్.

ధృవ లో ఉన్న ఈ స్పెషల్ సాంగ్ కీలకంగా ఉంటుందట. అవటానికి ఐటం సాగే అయినా అతిముఖ్య మైన సన్ని వేశం లో వచ్చే ఈ సాంగ్ కోసం మామూలు ఐటం గర్ల్స్ కంటే పేరున్న తార కావాలనుకున్నార్ట చిత్ర బృందం. అందుకే ఈ సాంగ్ కోసం కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించి .. చివరికి కాజల్ ను ఫైనల్ చేశారని అంటున్నారు.

ముందుగా ఈ సాంగ్ కోసం హాట్ యాంకర్ అనసూయని అనుకున్నా తర్వాత మళ్ళీ ఈ ఆఫర్ కాజల్ దగ్గరికే వచ్చింది. గతంలో 'మగధీర' .. 'గోవిందుడు అందరివాడేలే' వంటి సినిమాలను ఆమె చరణ్ తో కలిసి చేసింది. అందువలన చరణ్ సినిమా అనగానే ఆమె ఓకే చెప్పేసిందని అంటున్నారు. మొత్తానికి ఈ రకంగానైనా ఈ జంటను మరోసారి తెరపై చూడవచ్చన్న మాట.

English summary
Kajal Agarwal will sparkle in a song with Ram Charan in his forthcoming film- Dhruva and currently this rumor has been in trending at filmnagar circles..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X