»   » షాకిచ్చే ....కాజల్ ఫేస్ బుక్ బిజినెస్

షాకిచ్చే ....కాజల్ ఫేస్ బుక్ బిజినెస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కాజల్ అగర్వాల్ అందగత్తే కాదు...మంచి బిజనెస్ మైండ్ ఉన్న అమ్మాయి అని ఆమెతో పని చేసిన వారు అంటూంటారు. అయితే అది నిజమే అని...ఆమె చేస్తున్న కొత్త బిజినెస్ ప్రూవ్ చేస్తోంది. చేతిలో సినిమాలు పెద్దగా లేని కాజల్ అగర్వాల్ సరికొత్త వ్యాపారాలు చేస్తోందట. మిగతా హీరోయిన్లు కూడా ఈ వ్యాపారం గురించి వింటే ఇలా కూడా సంపాదన చేయవచ్చా అని షాకవుతున్నారు.

విషయంలోకి వెళితే సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా చేసే ఈ బిజినెస్‌లో హీరోయిన్‌గా వున్న గుర్తింపే ప్రధానం. ఫేస్‌బుక్ వంటి అఫీషియల్ తన పేజీలో వాణిజ్య ప్రకటనలు పెడుతూ ఆదాయం సంపాదిస్తోందట. దాదాపు ఒక కోటి 50 లక్షల మంది ఆమె ఫేస్‌బుక్‌ను ఫాలో అవుతున్న దృష్ట్యా ఈ వాణిజ్య ప్రకటనలన్నీ వాళ్లు చూసే వీలుంది. అందుకే సదరు ఉత్పత్తిదారులనుంచి వాణిజ్య ప్రకటనలు సేకరించి తన ఫేస్‌బుక్‌లో పెడుతూ ఆ ఉత్పత్తిదారులనుంచి ఆదాయం పొందుతోందట.


కాజల్ మాట్లాడుతూ....నాకు సేవా కార్యక్రమాలంటే ఆసక్తి. ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచాను. బాలికల హక్కుల పరిరక్షణ, జీవన శైలి వల్ల వచ్చే వ్యాధులపై ఫేస్‌బుక్‌ ద్వారా అవగాహన కలిగించాలనుకుంటున్నా. తాతయ్య క్యాన్సర్‌తో చనిపోయారు. అందువల్ల జనాలకి క్యాన్సర్‌పైనా అవగాహన పెంచడానికి కృషి చేస్తాను అంది. నాగార్జున అంటే ఇష్టం. హీరోయిన్స్ ల్లో నయనతార అంటే అభిమానం.


హీరోయిన్ అన్నాక..కొంత వ్యక్తిగత జీవితం కోల్పోవాల్సిందే. సెలబ్రిటీలుగా మాపైనే అందరి దృష్టి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ బాధ్యతగా నడుచుకోవాలి. నేను దేవుడిని నమ్ముతా. తిరుపతితో పాటు కాశ్మీర్‌ వైష్ణోదేవీని తరచూ సందర్శిస్తుంటాను. ముంబైలో ఉంటే సిద్ధి వినాయక దేవాలయానికి నిత్యం వెళుతుంటాను. దైవారాధన గొప్ప మానసిక శక్తిని ఇస్తుంది. పెళ్లెప్పుడు? అన్నది పెద్ద ప్రశ్న. ఇంతవరకూ నాకు తగినవాడు కనిపించనేలేదు. అయినా ప్రస్తుతం సినిమాల్లో బిజీ. సమయం వస్తే అప్పుడు ఆలోచిస్తాను. నేను చేసుకోబోయేవాడు కుటుంబ విలువలకు గౌరవం ఇచ్చే వ్యక్తి అయి ఉండాలి. మా కుటుంబాన్ని బాగా ప్రేమించే వాడై ఉండాలి. ప్రేమ వివాహం చేసుకున్నా కుటుంబ సభ్యుల అనుమతితోనే చేసుకుంటాను అంది.

English summary
Kajal agarwal is promoting few ads with her pages and don't know how much she gains from it. This stands as a side business of her from Facebook.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu