»   » కాజల్ భలే లక్కీ.. మళ్లీ ఇంకోటి

కాజల్ భలే లక్కీ.. మళ్లీ ఇంకోటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కాజల్ అగర్వాల్ భలే లక్కీ అంటున్నారు సినీ జనం. ఆమె హిందీలో నటించిన సింగం, స్పెషల్ 26 చిత్రాలు విడుల అయ్యాయి. రెండూ బాగానే ఆడాయి. అయినా ఆమెకు అక్కడ పెద్దగా ఆఫర్స్ రాక మళ్లీ తమిళ, తెలుగు భాషల్లో బిజీ అవటం మొదలెట్టింది. అయితే అనుకోని విధంగా మళ్ళీ ఆమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. సుధీర్ మిశ్రా దర్శకత్వంలో రూపొందనున్న ఔర్ దేవదాస్ చిత్రంలో ఆమె ఎంపకయ్యింది. తను స్క్రిప్టు బాగా నచ్చిందని, అందుకే వెంటనే ఒప్పుకుని సెప్టెంబర్ నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నానని చెప్తోంది.

మరోప్రక్క కాజల్....బండ్ల గణేష్ కి వరసగా మూడోసారి డేట్స్ ఇచ్చింది. గతంలో బండ్ల గణేష్ నిర్మాతగా వచ్చిన 'బాద్‌షా'లో చేసిన ఆమె తర్వాత తెలుగులో ఇదే నిర్మాత నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చేస్తోం. ఇప్పుడు మళ్లీ ఇదే నిర్మాత నిర్మించనున్న పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ రానున్న చిత్రానికి సైన్ చేసింది. మధ్య గ్యాప్ లో తెలుగులో ఏ ఇతర సినిమా ఒప్పుకోలేదు.

Kajal Aggarwal bags another Bollywood flick

దాంతో బండ్ల గణేష్ కు ఆమె వరస డేట్స్ ఇవ్వటానికి కారణంగా... మధ్య రెమ్యునేషన్ విషయమై కుదిరిన ఒప్పందమే అని చెప్పుకుంటున్నారు. కాజల్ ...రెమ్యునేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని, అదే ఆమె బలహీనత,బలం అని అంటారు. ఆ పాయింట్ మీద గణేష్ వర్కువుట్ చేసాడని అంటున్నారు. బయిట ఏ నిర్మాత ఆఫర్ చేయని విధంగా గణేష్ ఆమెకు రెండు కోట్లు ఇస్తున్నారని, అందుకే ఆమె వెంటనే సై అంటోందని సమాచారం.

''పని.. పని.. పని.. జీవితమంతా ఇలాగే ఉంటే ఇక ఆనందం ఎక్కడుంటుంది. అందుకే చిత్రీకరణలో ఎంత బిజీగా ఉన్నా.. ఓ చల్లని సాయంత్రం అలా స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్రాధాన్యమిస్తాను. వాళ్లతో మాట్లాడుకుంటూ.. చల్లని పళ్ల రసం తాగుతూ ఉంటే ఆ ఆనందమే వేరు'' అంటోంది కాజల్‌

English summary
Kajal has just signed on to do a film titled “Aur Devdas” that will be directed by Sudhir Mishra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu