»   » టాలీవుడ్‌లో కాజల్‌కు సవతి పోరు

టాలీవుడ్‌లో కాజల్‌కు సవతి పోరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన కాజల్‌కు ఓ వింత సమస్య పట్టి పీడిస్తోంది. పాపం అమ్మడు ఇంత ఎత్తుకు ఎదిగినా సవతి పోరు మాత్రం తప్పడం లేదు. ఇలా అనడానికి కారణం...కాజల్ తన కెరీర్లో సోలో హీరోయిన్‌గా చేసిన సినిమాల కంటే ఇతర హీరోయిన్లతో స్క్రీన్ పంచుకుని చేసినవే ఎక్కువ. అప్పట్లో వచ్చిన 'చందమామ" సినిమా దగ్గర నుంచి, తర్వలో రాబోతోన్న 'బిజినెస్" మ్యాన్ వరకు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అవగతం అవుతుంది.

చందమామ సినిమాలో సింధుమీనన్‌తో కలిసి స్క్రీన్ పంచుకున్న కాజల్, ఓం శాంతి ఓం సినిమాలో బింధుమాధవి, అతిథి శర్మలతో, ఆర్య2లో శ్రద్దాదాస్, బృందావనంలో సమంత, మిస్టర్ పర్ ఫెక్ట్, వీర సినిమాల్లో తాప్సీతో కలిసి స్క్రీన్ పంచుకుంది. ఇప్పటి వరకు దాదాపు అందరు టాప్ హీరోలను కవర్ చేసిన ఈ భామ ఎట్టకేలకు మహేష్‌బాబుతో 'ది బిజినెస్ మ్యాన్" సినిమాలో అవకాశం దక్కించుకుంది. అయితే ఇక్కడ కూడా కాజల్‌కు సవతి పోరు తప్పడం లేదు. మహేష్ ఇందులో హన్సికను సెకండ్ హీరోయిన్‌గా బుక్ చేసుకున్నాడు.

వేరే వారు ఉంటేనేం? లీడ్ రోల్ చేస్తుంది కాజలే కదా...ఈవిడకొచ్చిన బాధేంటో? అనుకుంటే పొరపాటే. ఈ వాదనతో కాజల్ అస్సలు ఏకీభవించడం లేదు. ఇంకో హీరోయిన్ ఉండటం వల్ల తనకు దక్కాల్సిన మొత్తం క్రెడిట్ లో ఎంతో కొంత వేరే హీరోయిన్ కి దక్కడాన్ని కాజల్ అస్సలు జీర్ణించుకోలేక పోతోంది.

మగధీర సినిమానే తీసుకుంటే....ఆ సినిమాకు సంబంధించిన క్రెడిట్ అంతా కాజల్ కే దక్కింది. బోలెడు పేరొచ్చింది. ఆ తర్వాత ఆమె దశ తిరిగి పోయింది. ఇతర సినిమాల్లో వేరే వారితో కలిసి నటించడం వల్ల పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే సవతి పోరును కాజల్ అస్సలు తట్టుకోలేక పోతోందట. అదీ మ్యాటర్.

English summary
Heroines Kajal angry on second heroines. Why because they are shared her credits.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X