»   » బాలీవుడ్ ఆఫర్స్ తో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతోంది...?

బాలీవుడ్ ఆఫర్స్ తో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతోంది...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాజల్ హీరోయిన్ గా బిజీ అయిపోవడం, బాలీవుడ్ లో అజయ్ దేవ్ గన్ తో నటించే ఛాన్స్ రావడంతో ఆమెకు తలపొగరు పెరిగిందని సినీవర్గాల్లో ఆమె గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. టాలీవుడ్‌లో చిన్నచిన్న ఆఫర్లతో ముందుకొచ్చిన కాజల్ ఒక్కసారిగా మగధీర హిట్‌తో హిట్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. ఆ తర్వాత మెల్లిగా కోలీవుడ్ వైపు దృష్టి సారించి అక్కడా గోల్డెన్ లెగ్గే అనిపించుకుంది. తాజాగా బాలీవుడ్ ఆఫర్ కొట్టేసి 'సింగం" చిత్రంలో నటించింది. అదేసమయంలో టాలీవుడ్‌లో కుర్రహీరో నాగచైతన్యతో దడలో చేస్తోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్‌లో చైతన్యతో కాజల్ దురుసుగా ప్రవర్తించిందట. ఇదే రీతిలో ఆమధ్య కోలీవుడ్‌లోనూ ప్రవర్తించేసరికి అగ్రదర్శకుడు మండిపడ్డారట.నాగచైతన్య చాలా బాధపడ్డాడని తెలుస్తోంది. ఈమధ్య సౌత్ ఫిలిం ఇండస్ట్రీ గురించి కూడా నోరు పారేసుకున్న కాజల్ నిజంగానే నాగచైతన్యని హర్ట్ చేసి వుంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఇవన్నీ తన ఎదుగుదలను చూడలేక కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని చెప్పుకొస్తోంది కాజల. తనకి తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్తోంది కాజల్.

English summary
Grapevine is Kajal Agarwal got her eyes on head with Singham offer in Bollywood. She is going out of control completely feeling like a prominent heroine in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu