Just In
- 10 min ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 25 min ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 1 hr ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 2 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
Don't Miss!
- News
రాజ్యాంగ వ్యవస్థపై జగన్ సర్కార్ పోరాటం, న్యాయ వ్యవస్థల నిర్ణయం : ఏపీ ఎన్నికలపై దేశం ఫోకస్
- Finance
టాప్ 100 కుబేరుల సంపద రూ.13.8 లక్షల కోట్లు జంప్, దేశంలోని పేదలకు రూ.94వేల చొప్పున ఇవ్వొచ్చు
- Sports
పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్సెట్ మార్చుకున్న రిషభ్!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భర్తను సినిమాల్లోకి లాగుతున్న కాజల్ అగర్వాల్.. ఆదాయం పెంచుకోవడానికి సరికొత్త ప్లాన్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల తన చిరకాల బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల డేటింగ్ అనంతరం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. అంటే వల్ల మధ్య ఎలాంటి అనుబంధం ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇక వ్యాపారంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆదాయాన్ని పెంచుకుమే ప్లాన్స్ కూడా వేస్తున్నారు.

సింపుల్ గా ముగిసిన వేడుక
కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న గౌతమ్ ను హిందు సంప్రదాయ ప్రకారం వివాహమాడిన విషయం తెలిసిందే. ముంబైలోని ఒక ఒక ప్రయివేట్ హోటల్ లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చాలా సింపుల్ గా పెళ్లి వేడుకను ముగించారు. ఇక ఆ వేడుకకు సినీ తారలు పెద్దగా హాజరుకాలేదు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

ఫ్రీ హనీమూన్ ట్రిప్
ఇక కాజల్ పెళ్లి అనంతరం హనీమూన్ కోసం మాల్దీవ్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక అందుకు సంబంధించిన ఫొటోలు కూడా చాలానే వైరల్ అయ్యాయి. కాజల్ హనీమూన్ కోసం కోట్లల్లో ఖర్చాయినట్లు అప్పట్లో టాక్ వచ్చింది. కానీ ప్రమోషన్ లో భాగంగా మాల్దీవ్స్ హోటల్స్ ఆ సెలబ్రెటీ కపుల్స్ కు ఫ్రీగా హనీమూన్ ట్రిప్ ను ఇచ్చినట్లు మరో టాక్ వచ్చింది.

సినిమాల్లోకి గౌతమ్ కిచ్లు
ఇక హనీమూన్ అయిపోగానే కాజల్ మళ్ళీ తన రెగ్యులర్ సినిమా లైఫ్ లోకి వచ్చేసింది. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది. అయితే కాజల్ తన భర్తను కూడా సినిమాల్లోకి లాగాలని చూస్తున్నట్లు సమాచారం. ఇంటీరియర్ బిజినెస్ మెన్ అయిన గౌతమ్ కు పెద్దగా సినీ ఫీల్డ్ తో టచ్ లేదు. అయితే కాజల్ కు ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి ఆమె ద్వారానే సినిమా బిజినెస్ లోకి రనున్నాడట.

కాజల్ తో కూడా మినీ బడ్జెట్ మూవీస్
త్వరలోనే గౌతమ్ కిచ్లు ఒక బిగ్ ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా ఉంటూ పెద్ద హీరోలతో సినిమాలు ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. అవసరం అయితే కాజల్ తో చిన్న బడ్జెట్ లోనే లేడి ఓరియెంటెడ్ సినిమాలను కూడా నిర్మించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాజల్ ఇప్పటికే కిచ్లు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ఉంటూ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. మరి గౌతమ్ ఆమె కెరీర్ కు ఏ విధంగా హెల్ప్ అవుతాడో చూడాలి.