»   » కాజల్ లిప్ లాక్ : ఇష్టం లేకుండా చేసినట్టైతే అనిపించటం లేదు... మీకెలా అనిపిస్తోంది ?

కాజల్ లిప్ లాక్ : ఇష్టం లేకుండా చేసినట్టైతే అనిపించటం లేదు... మీకెలా అనిపిస్తోంది ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటివరకూ ఒక్క సారి కూడా ఆన్ స్క్రీన్ పై లిప్ లాక్ సన్నివేశం చేయలేదు. ఎంత పెద్ద సినిమా అయినా ఎంతటి బడా స్టార్ అయినా తన రూల్ ని మాత్రం ఇన్నేళ్లూ బ్రేక్ చేయలేదు కాజల్. ఇప్పుడో బాలీవుడ్ మూవీలో కోసం ముద్దు సీన్ చేయడం సంచలనం అయింది. అయితే ఈ ముద్దు సీన్ వెనక ఉన్న స్టోరీని "దో లఫ్జోం కీ కహానీ" దర్శకుడు దీపక్ అప్పట్లో వేరే రకంగా నరేట్ చేసాడు.

నిజానికి కాజల్ కి ఆ ముద్దు సీన్ ఇష్టం లేదనీ సీన్ తప్పని సరి కాబట్టే కాజల్ ని ఒప్పించామనీ అనినా కాజల్ అంగీకారం తెలపక ముందే అసలు విశయం తెలియని రణ్ దీప్ హుడా ఆ సన్నివేశం చివర్లో ముద్దు పెట్టేయటం తో అప్ సెట్ అయిన కాజల్. షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వెళ్లిపోయి మళ్ళీ లిప్ లాక్ చేయబోనని కండిషన్ పెట్టడంతోపాటు సినిమాలో ఆ సీన్ ఉండకూడదని కూడా చెప్పిందనీ ఒక కథ చెప్పాడు. అయితే ఇప్పుడు బయటికి వచ్చిన ఆ ముద్దు పిక్చర్ చూస్తూంటే మాత్రం జరిగింది వేరేమో అనిపిస్తోంది....

Kajal Lip Lock in "Do Lafzoon Ki Kahani"

ఇదేదో మూడ్ లో క్యారీ అయిపోయి రణ్ దీప్ ఒక్కడే ముద్దెట్టేశాడు అన్నట్లు మాత్రం లేదు. తనకంటే హైట్ ఉన్న రణదీప్ హుడాను. కాజల్ కాస్త పైకి లేచి మరీ మెడ చుట్టూ తన చేత్తో కావలించుకుని. చాలా రొమాంటిక్ గా, చాలా ఇష్టం తో ముద్దు పెట్టుకున్నట్టే కనిపిస్తోంది. ఒకవేళ అమ్మడికి ముద్దు సీన్ ఉంటుందని తెలియక పోయినా, కిస్సింగ్ సీన్లో నటించతం ఇష్టం లేకపోయినా. ఆ బాడీ లాంగ్వేజ్ లో తేడా తెలిసి పోయేది. మరి ఇష్టం లేకుండా మనోడు అలా టక్ మని పెట్టేశాడు అంటారేటి...?

సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా కాని. "ఆల్వేస్" అనే కొరియన్ కొరియన్ సినిమా కి రీమేక్ అని చెప్పి, ఈ "ఇష్టం లేని ముద్దు కథని" కూడా కలిపి తెగ ప్రమోట్ చేస్తున్నారు. బాలీవుడ్ కంటే టాలీవుడ్ లో నే కాజల్ ముద్దు తో అయినా ఈ హిందీ సినిమాకు మాంచి ఓపెనింగ్స్ వస్తాయేమో అనుకుని ఉంటారా..! ఏమో మరి అసలు ఏ ముద్దు వెనకాల ఏ కథుందో ఎవరికి తెలుసు.... జూన్ 10 న వస్తూన్న ఈ సినిమా చూస్తే తప్ప చెప్పలేం...

English summary
Is Kajal Aggarwal really got upset with Randeep Hooda's kiss in 'Do Lafzoon Ki Kahani"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu