»   » ‘సర్దార్‌...’ లో మరో స్పెషాలిటీ..ఈ సారి కాజల్ వైపు నుంచి

‘సర్దార్‌...’ లో మరో స్పెషాలిటీ..ఈ సారి కాజల్ వైపు నుంచి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరవుతున్న నేపధ్యంలో రోజుకో అప్ డేట్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి విశేషం బయిటకు వచ్చింది.

అది మరోదే కాదు..ఇన్నాళ్లూ తను తెరపై కనిపించే పాత్రలకు వేరే వారి చేత డబ్బింగ్ చెప్పించే కాజల్ ..ఈ సారి తన సొంత వాయిస్ ఇవ్వబోతోంది. అంతేనా పవన్ పాడే పాటలో ..గొంతు కలపనుందని తెలుస్తోంది.


రీసెంట్ గా కాజల్ డబ్బిగ్ పూర్తి చేసిందని, మొదట్లో కొద్ది సేపు టెన్షన్ గా అనిపించినా తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలిగానని, తను తెరపై చేసిన పాత్రకు తను డబ్బింగ్ చెప్పుకోవటం మంచి ఎక్సపీరియన్స్ అని చెప్తోంది. అలాగే తన పాత్ర చాలా అద్బతంగా ఉంటుందని హామీ ఇస్తోంది. అదీ మ్యాటర్.


Kajal own voice For Sardaar Gabbar Singh

ఇక లేటెస్ట్ విశేషాలకు వస్తే...


'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఈ రోజే (ఆదివారం) హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరగబోతోంది. ఈ వేడుక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని, అందుకు అభిమానులంతా సహకరించాలని పవన్‌ కల్యాణ్‌ శనివారం మీడియా సమావేశంలో కోరారు.


జ్వరంతో బాధపడుతున్న ఆయన 'సర్దార్‌...' కార్యాలయంలో మాట్లాడారు. పాటల వేడుక నిర్వహణ కోసం పోలీసువారిని సంప్రదించినప్పుడు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారనీ, అందుకే శుక్రవారందాకా వేడుక నిర్వహించాలా వద్దా అనే మీమాంసలో ఉన్నామని చెప్పారు పవన్‌.


Kajal own voice For Sardaar Gabbar Singh

నిర్మాత శరత్‌మరార్‌ వ్యక్తిగతంగా వెళ్లి పోలీసులను సంప్రదించిన నేపథ్యంలో డీజీపీ అనురాగ్‌శర్మ, కమిషనర్‌ సీవీ ఆనంద్‌, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు అందించిన సహకారంతో వేడుక నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులకీ, పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు పవన్‌.


అలాగే..''అభిమానులు నా సినిమా వేడుకలకు హాజరై క్షేమంగా ఇంటికి తిరిగెళ్లకపోతే నాకే బాధ. అందుకే బహిరంగ వేడుకలు నిర్వహించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను''అన్నారు పవన్‌కల్యాణ్‌. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' వేడుకకు ఎంట్రీ పాసులు ఉన్నవాళ్లే రావాలని, లేనివాళ్లు ఇంట్లోనే టీవీల్లో వీక్షించాలని కోరారు.

English summary
Kajal Aggarwal, the leading lady of Sardaar Gabbar Singh film, has dubbed for her voice. This is her debut attempt at dubbing for herself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu