»   » దిల్ రాజు కోసం కాజల్ ఫ్రీగా చేయడం లేదా?

దిల్ రాజు కోసం కాజల్ ఫ్రీగా చేయడం లేదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా విడుదలైన తన 'ఎవడు' చిత్రానికి ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు శృతి హాసన్‌తో ప్రమోషన్లు నిర్వహించిన దిల్ రాజు...తాజాగా ఈ చిత్రంలో గెస్ట్ రోల్‌లో చేసిన కాజల్‌ను కూడా రంగంలోకి దింపారు.

సాధారణంగా సినిమా ప్రమోషన్లలో మెయిన్ హీరోయిన్లే పాల్గొంటారు. కానీ కాజల్‌ ప్రమోషన్లలో పాల్గొనడం వెనక ప్రత్యేకమైన కారణం ఉందని, ఆమె ఫ్రీగా ప్రమోషన్లలో పాల్గొనడం లేదని, ఇందుకుగాను దిల్ రాజు ప్రత్యేకంగా ఆమెకు కొంత మొత్తాన్ని చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రమెషన్లు జోరుగా నిర్వహించడం వల్ల సినిమా కలెక్షన్లు పెరుగుతాయనేది దిల్ రాజు ప్లాన్.

కాగా...'ఎవడు' సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 40 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని ట్రేడ్ వర్గాల సమాచారం. కోట్ల నుంచి లక్షలకు డే బై డే కలెక్షన్స్ డ్రాప్ అవటం జరిగింది. పండగ సీజన్ లో సినిమాకు హిట్ టాక్ రావటం ప్లస్ అయ్యింది. అంతేకాకుండా ఈ చిత్రం పోటీ అయిన 1 నేనొక్కడినే కమర్షియల్ గా డ్రాప్ అవటం కూడా సినిమాకు కలిసివచ్చింది. అయితే ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉండటంతో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు.

రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'ఎవడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం విడుదలైంది.

English summary

 Kajal getting money for promoting Yevadu. By observing in the sudden dip in Yevadu collections producer Dil Raju is planning huge promotional campaigns and Kajal Agarwal participating in the promotions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu