»   » డార్లింగ్ ప్రభాస్ తో కాజల్ చెల్లెలు నిషా

డార్లింగ్ ప్రభాస్ తో కాజల్ చెల్లెలు నిషా

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ హీరోయిన్ కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్...మొన్న జరిగిన 'డార్లింగ్' ఆడియో పంక్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమె డార్లింగ్ లో గెస్ట్ రోల్ వేసిందని సమాచారం. అది ఫస్టాఫ్ లో కనిపిస్తుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని డైరక్షన్ డిపార్టమెంట్ వాళ్ళ ద్వారా బయిటకు వచ్చింది. అయితే ఆమె కనపడేది ఒక్క సీన్ లోనేనని, అలాగే కనపడిన కాస్సేపైనా ఆమె గుర్తుండిపోయేలాంటి పాత్ర అని వినిపిస్తోంది. అయితే దర్శకుడు కరుణాకరన్ మాత్రం ఈ విషయమై నోరు విప్పటం లేదు. మీడియావారు అడిగితే తెరపై చూసి తేల్చుకోండి అని తేల్చేసారు.

అలాగే నిషా అగర్వాల్ తెలుగులో డైరక్ట్ గా మహిళా దర్శకురాలు బి.జయ రూపొందించబోతున్న డబుల్ ధమాకా లో అవకాశం సంపాదించింది. మే నెల రెండవ వారం నుండి ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో నాని, కృష్ణుడు ఈ చిత్రంలో ఆమె కోసం పోటీపడనున్నారు. అలాగే ఈ చిత్రం నవంబర్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక కాజల్ తన చెల్లిని పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిప్పుతూ అందరికీ పరిచయం చేస్తోంది. బెస్టాఫ్ లక్ నిషా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu