»   » కళ్యాణ్ రామ్ నెక్ట్స్ చిత్రం ఆ ఫ్లాప్ డైరక్టర్ తో

కళ్యాణ్ రామ్ నెక్ట్స్ చిత్రం ఆ ఫ్లాప్ డైరక్టర్ తో

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరసగా జయీభవ, కత్తి చిత్రాలతో డిజాస్టర్ హీరోగా మారిన కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. గతంలో జగపతి,ఎదురులేని మనిషి,మా ఆయన బంగారం,బంగారు బాబు వంటి ఫ్లాప్ చిత్రాలు అందించిన జొన్నలగడ్డ శ్రీనివాసరావుతో చిత్రం చేయబోతున్నారు. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ పూర్తయినట్లు సమాచారం. పూర్తి మశాలా అంశాలతో సినిమా ఉంటుందని, ఈ సారి ఎలాగయినా హిట్టు కొడతానని కళ్యాణ్ రామ్ నమ్మకంగా ఉన్నట్లు చెప్తున్నారు. తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. సురేంద్రరెడ్డి తో చేసిన అతనొక్కడే తప్ప కెరీర్ లో చెప్పుకోతగ్గ సినిమాలు ఏమీ లేని కళ్యాణ్ రామ్ ఇంకా ట్విస్టులో కూడిన కథలు దగ్గరే ఆగిపోయాడని, కథకన్నా ఇంటర్వెల్ ట్విస్టులు, ఐటం సాంగ్ లు వంటి అంశాలు ఉన్నాయా లేవా వంటివి చూసుకుంటాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతూంటుంది. అందులోనూ సూపర్ హిట్ రెడీ ఫార్మెట్ లోకి వెళ్ళి జయీభవ, కత్తి చేసినా వర్కవుట్ కాకపోవటం అతన్ని పూర్తిగా నిరాశపరిచిందని, పూర్తి యాక్షన్ సబ్జెక్ట్ పడితే తిరిగి నిలబడతానని కళ్యాణ్ రామ్ గట్టిగా నమ్ముతున్నారు.

English summary
Director Jonnalagadda Srinivas has approached Kalyan Ram with Fresh script and narrated him. It is said that Kalyan was quite impressed with the script and accepted to do the film with no objection.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu