»   » 'కత్తి' గా కళ్యాణ్ రామ్ ఫిక్స్..జూ ఎన్టీఆర్ కాదు

'కత్తి' గా కళ్యాణ్ రామ్ ఫిక్స్..జూ ఎన్టీఆర్ కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కత్తి' టైటిల్ తో గుణశేఖర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో ఓ చిత్రం చేద్దామని ఆ మధ్య ప్రయత్నాలు జరిగాయి. అయితే అనుకోని పరిణామాలతో అవన్నీ ఆగిపోయాయి. దాంతో ఆ 'కత్తి' టైటిల్ తుప్పుపట్టి మూలనపడిపోయింది. ఇప్పుడు దాన్ని బయిటకు తీసి తన తాజా చిత్రానికి పెట్టుకున్నాడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ తాజాగా అభిమన్యు మల్లి తో చేస్తున్న చిత్రానికి ఈ టైటిల్ ని కన్ఫర్మ్ చేసారని సమాచారం. ఇక కళ్యాణ్ రామ్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ మీడియాకు న్యూస్ ఇవ్వకుండా చేస్తున్న ఈ చిత్రంకి మొదట హరేరామ హరే కృష్ణ అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఈ టైటిల్ వేరే వారి దగ్గర ఉండటంతో మనస్సు మార్చుకుని కళ్యాణ్ రామ్ 'కత్తి' దగ్గర ఆగాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగే జయీభవ చిత్రం ఫెయిల్యూర్ ఉన్న కళ్యాణ్ రామ్ కి ఈ 'కత్తి' చిత్రం అయినా హిట్టిస్తుందని ఆశిద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu