Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కళ్యాణ్ రామ్ బిగ్ బడ్జెట్ మూవీ.. మొదటిసారి లిమిట్స్ దాటుతున్నాడా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విదంగా సినిమా హీరోలు వరుసగా బిగ్ బడ్జెట్ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కూడా అదే తరహాలో ఒక ప్లాన్ వేసినట్లు టాక్ వస్తోంది. కొడితే బాక్సాఫీస్ హిట్ చాలా స్ట్రాంగ్ గా కొట్టాలని ఈ నందమూరి హీరో బడ్జెట్ కూడా గట్టిగానే పెంచుతున్నట్లు సమాచారం. టైమ్ మెషిన్ బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా తెరకెక్కే అవకాశం ఉందట.
గత కొంతకాలంగా కళ్యాణ్ రామ్ సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం వేణు మల్లిడి దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. కళ్యాణ్ రామ్ సొంత ప్రొడక్షన్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే ఆ సినిమాను రూపొందిస్తారట. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ తన మార్కెట్ ను మించి లిమిట్స్ దాటి ఖర్చు చేయడానికి డిసైడ్ అయ్యారట.

ఇక ఆ సినిమాలో కళ్యాణ్ రాన్ రావణుడి గెటప్ లో ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమాను నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కిస్తారట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. మరి సినిమా ఎంతవరకు. క్లిక్కవుతుందో చూడాలి. కళ్యాణ్ రామ్ నెక్స్ట్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.