twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్యాణ్ రామ్ 'ఓం' విడుదల తేదీ మారిందా?

    By Srikanya
    |

    హైదరాబాద్: 'అతనొక్కడే' చిత్రంతో హీరోగా తన సత్తా చూపించి, 'హరేరామ్' సినిమా విజయంతో మాస్ ఆడియన్స్‌కి రీచ్ అయ్యారు నందమూరి కల్యాణ్‌రామ్. ఆయన తాజాగా తను హీరోగా నటిస్తూ నిర్మించిన 3డి స్టీరియోఫోనిక్ సినిమా 'ఓం' . ఈ చిత్రం ఈ నెల 28 న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే టెక్నికల్ రీజన్స్ వల్ల వచ్చే నెల 19 కి వాయిదా పడిందని సమాచారం.

    కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..."ఉత్తేజాన్నిచ్చే యాక్షన్ సన్నివేశాలు, ఆహ్లాదకరమైన వినోదం, వినసొంపైన సంగీతం మేళవింపుతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. భారతదేశపు తొలి యాక్షన్ 3డి చిత్రమిది. విజయ్, రవివర్మ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాల్ని 3డిలో చూడటం ప్రేక్షకులకి కొత్త అనుభూతినిస్తాయి. విదేశాల నుంచి ప్రత్యేకంగా కెమెరాలు, లెన్స్‌లు తెప్పించాం. ఓ యువకుడు తనకు ఎదురైన అనుభవాలు మూలంగా ఎలా మారాడు, ఎవరిపై విజయం సాధించాలని తపించాడు అన్నది చిత్రంలో ముఖ్యాంశం. 3డి, విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు విదేళాల్లో చేశాం. ' అని తెలిపారు.


    అమెరికా నుంచి నిపుణులను తీసుకొచ్చి చిత్రీకరణ చేశారు. స్టెప్‌ అప్‌3, ఫైనల్‌ డెస్టినేషన్‌, స్పైడర్‌మేన్‌4, అవతార్‌, రెసిడెంట్‌ ఈవిల్‌ లాంటి చిత్రాలకు పని చేసిన అనుభవం వాళ్లకు ఉంది. రెడ్‌ ఎపిక్‌, త్రీడీ రిగ్‌ కెమెరాలు, లెన్స్‌లు అక్కడి నుంచే వచ్చాయి. సుమారు 150 రోజులపాటు షూటింగ్‌ చేశాం. గత ఏడు నెలలుగా అమెరికా, సింగపూర్‌ల్లో త్రీడీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి. పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని విస్మయపరుస్తాయి.

    ఈ చిత్రంతో సినిమాటోగ్రాఫర్ సునీల్‌రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్నారు. కృతి కర్బందా, నికిషా పటేల్ హీరోయిన్లు. యన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి అచ్చు, సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు.

    English summary
    
 Nandamuri family Kalyanram is coming up with a different concept with his next film titled as ‘OM.’ He is making this film huge budget in 3D format, which is first of its kind in Telugu film industry. For this he has roped in several visual and graphic experts from Germany, who worked for Hollywood movies. Kalyan Ram said every visual effect will be very special of its kind and he expressed full confidence that audiences will be delighted to watch the movie. Shooting of the film completed long back but post production works are taking its time. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X