For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కమల్ కీలక నిర్ణయం.. ఆనందంలో చరణ్ ఫ్యాన్స్.. ఇక లైన్ క్లియర్!

  |

  సుమారు 20 ఏళ్ల క్రితం తెరకెక్కించిన భారతీయుడు సినిమాకి దర్శకుడు శంకర్ ఇప్పుడు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ క్రేన్ ప్రమాదం కారణంగా నిలిచిపోయింది. క్రేన్ ప్రమాదం జరిగిన సమయంలో శంకర్ కూడా గాయపడటంతో కొన్ని రోజుల పాటు హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు.

  ఆయన కోలుకున్నాక షూటింగ్ మొదలవుతుంది అనుకుంటే ఆ షూటింగ్ మొదలు కాలేదు. చివరికి లైకా ప్రొడక్షన్స్ - శంకర్ మధ్య విభేదాలు నెలకొనడం, అవి కోర్టు కేసులు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయంలో తాజాగా ఒక అప్డేట్ వచ్చింది ఆ వివరాల్లోకి వెళితే

   సూపర్ హిట్ సినిమా సీక్వెల్

  సూపర్ హిట్ సినిమా సీక్వెల్

  భారత దేశ వ్యాప్తంగా చెప్పుకోదగ్గ దర్శకులలో ఒకరైన శంకర్ సుమారు 20 ఏళ్ల క్రితం తాను తీసిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొద్ది నెలల క్రితం క్రేన్ ఆక్సిడెంట్ కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత దేశంలో కరోనా ఎంటర్ కావడంతో షూటింగ్ లేని పరిస్థితి. ఇక ఆ తర్వాత జరుగుతుంది అనుకున్న సమయంలో కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

  షూట్ మొదలుపెట్టాలని చూసినా

  షూట్ మొదలుపెట్టాలని చూసినా

  కరోనా తర్వాత కాస్త పరిస్థితి కుదుటపడింది అందరూ షూటింగ్ మొదలు పెడుతున్నారు అని ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాలని శంకర్ భావించారు..అనూహ్యంగా కమలహాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ఎన్నికల కోసం బిజీబిజీగా గడపడం, ప్రచారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళడంతో సినిమా షూటింగ్ జరపలేని పరిస్థితి. దీంతో ఈ విషయం గురించి శంకర్ నిర్మాతలను కూడా సంప్రదించాడు. అయితే వాళ్లు అప్పుడు ఏమీ స్పందించలేదు. ఈ నేపధ్యంలోనే శంకర్ రామ్ చరణ్ తో సినిమా మొదలు పెట్టేందుకు గాను అధికారిక ప్రకటన కూడా చేశాడు.

  చరణ్ - శంకర్ సినిమా ప్రకటన

  చరణ్ - శంకర్ సినిమా ప్రకటన

  దిల్ రాజు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందిస్తున్నాం అంటూ దిల్ రాజు సంస్థ ప్రకటించింది.. భారీ బడ్జెట్ తో శంకర్ ర్ ఈ సినిమా రూపొందిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన వచ్చే వరకు ఏమీ స్పందించని లేక ప్రొడక్షన్స్ సంస్థ, మా సినిమా పూర్తి చేయకుండా ఈ సినిమా ఎలా చేస్తారు అంటూ శంకర్ కు నోటీసులు పంపారు. ఇంత జరుగుతున్నా సరే కమల్ హాసన్ ఏమీ స్పందించలేదు. దీంతో ఈ సినిమా మీద సందిగ్ధత నెలకొంది.

  కమలే కారణం

  కమలే కారణం


  అయితే ఈ వివాదానికి కారణం కమలహాసన్ అని కొందరు అంటున్నారు. దానికి కారణం క్రేన్ ప్రమాదం తర్వాత సినిమా షూటింగ్ మొదలు కాకపోవడానికి కమల్ హాసన్ శైలి కారణమని చెబుతున్నారు.. ఈ సినిమా షూటింగ్ గురించి ఆలోచించకుండా బిగ్ బాస్ షూటింగ్ కు హాజరు కావడం, ఆ వెంటనే లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమా ప్రారంభించారు ఆయన. ఇక ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయ్యారు. కానీ రాజకీయాల్లో ఆయనకు ఆయన పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేక పోయిన నేపథ్యంలో మళ్లీ కమల్ సినిమాల మీద దృష్టి పెడుతున్నట్లు సమాచారం.

  రంగంలోకి కమల్

  రంగంలోకి కమల్


  స్వయంగా తానే శంకర్ లైక్ ప్రొడక్షన్ సంస్థ వారితో కూర్చుని మాట్లాడి సినిమా మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే 180 కోట్ల దాకా ఖర్చు పెట్టిన సినిమాను ఇప్పుడు అర్ధాంతరంగా ఆపేయడం సరి కాదని భావించిన ఆయన ఈ మేరకు చొరవ తీసుకుంటున్నారని అంటున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

  అదే జరిగితే లైన్ క్లియర్

  అదే జరిగితే లైన్ క్లియర్


  ఇక ఈ సినిమా కనుక ప్రారంభిస్తే రామ్ చరణ్ శంకర్ సినిమాకి ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఇప్పటిదాకా రామ్ చరణ్ శంకర్ సినిమాకు ఇండియన్ 2 నిర్మాతల నుంచి ఏమైనా అడ్డంకులు వస్తాయి ఏమో అని భయపడుతున్న ఫ్యాన్స్ కి ఇది ఒక రకంగా ఊరట కలిగించే వార్త అని చెప్పాలి. వీలైనంత త్వరగా ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసి అప్పుడు శంకర్ రామ్ చరణ్ సినిమా మీద దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  English summary
  Kamal Haasan, the actor-politician is eager to wrap up his current film commitments. we all know he and his party failed in recent Tamil Nadu assembly elections. As per the latest reports, Kamal Haasan is planning to resume the shoot of Indian 2 immediately by convincing lyca producations and shankar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X