ఒకే దెబ్బకి రెండు పిట్టలు.... ‘విశ్వరూపం-2’ కూడా రెడీ అయిందా?
హైదరాబాద్ : కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం'చిత్రంపై తమిళనాడులో బ్యాన్ తదితర గొడవలను పక్కన పెడితే.....ఈ చిత్రం ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో రిలీజై బాక్సాఫీసు వద్ద మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ 'విశ్వరూపం-2' కూడా ఉంటుందని సినిమా క్లైమాక్స్ లో హింట్ ఇచ్చాడు కమల్ హాసన్.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. విశ్వరూపం చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో రూపొందిన కమల్ హాసన్ 'విశ్వరూపం-2' పార్టును కూడా ఇదే బడ్జెట్ లో మాగ్జిమమ్ పూర్తి చేసాడట. విశ్వరూపం సినిమా మొత్తం ఆప్ఘనిస్థాన్, అమెరికాల్లో చిత్రీకరించారు.
దీంతో ముందస్తు ప్లాన్ ప్రకారం విశ్వరూపంతో పాటు విశ్వరూపం-2 చిత్రానికి సంబంధించిన సీన్లను కూడా ఆల్రెడీ చిత్రీకరించారట. ఈ మేరకు ఈ చిత్ర నటీనటులతో కూడా ముందే ఒప్పందం కుదుర్చుకున్నాడట. మరికొంత భాగం ఇండియాలో చిత్రీకరిస్తే 'విశ్వరూపం-2' చిత్రం పూర్తవుతుందని, భారీ లాభాలు ఆర్జించడంలో భాగంగానే ఒక బిజినెస్ మేన్ లా ఆలోచించి కమల్ హాసన్ ఇలా చేసాడని అంటున్నారు.
విశ్వరూపం చిత్రం విడుదలై హిట్టయిన తర్వాత 'విశ్వరూపం-2'కు బ్యాలెన్స్ ఉన్న పార్ట్ ను షూట్ చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు కమల్. అయితే అనుకోని విధంగా 'విశ్వరూపం' చిత్రం వివాదాల్లో చిక్కుకుని తమిళనాడుతో పాటు కొన్ని చోట్ల విడుదలకు నోచుకోలేదు.


Click it and Unblock the Notifications











