»   » రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్

రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: తెలుగు హీరోయిన్ కామ్నా జఠ్మలానీ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె బెంగుళూరుకు చెందిన సూరజ్ అనే వ్యాపార వేత్తను పెళ్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుక చాలా రహస్యంగా, ముఖ్యంగా మీడియాకు తెలియకుండా జరిగిందట.

  ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటని సన్నిహితులు అడిగితే....పెళ్లయిందని తెలిస్తే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయని అలా చేయాల్సి వచ్చిందని చెబుతోందట. అసలు కామ్నా జఠ్మలానీ ఈ మధ్య సినిమాల్లోనే కనిపించడం లేదు, అవకాశాలు కూడా తక్కువే. మరి ఎందుకు ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అనేది చర్చనీయాంశం అయింది.

  సినీతారలు ఆడే సిసిఎల్ క్రిరెట్ టోర్నీ సందర్భంగా సూరజ్‌తో కామ్నాకు పరిచయం ఏర్పడిందని, ఈ క్రమంలోనే ఇద్దరి మనసులు కలిసి ఒకటయ్యారట. ఈ వివాహ వేడుకకు తన తోటి హీరోయిన్లు పూనమ్ బజ్వా, మీనాక్షి దీక్షిత్ హాజరైనట్లు సమాచారం.

  అమ్మడు తెలుగులో హీరోయిన్‌గా దాదాపు అరడజను పైనే సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసింది. అందులో ఎక్కువ సినిమాలు కామెడీ స్టార్ అల్లరి నరేష్ తోనే చేసింది. అయితే ఈ సినిమాల వల్ల అల్లరి నరేష్ కెరీర్ గ్రాఫ్ పెరిగిందే తప్ప కామ్నాకు కలిసొచ్చిందేమీ లేదు. మెల్లి మెల్లిగా ఆమె చేతిలో అవకాశాలు తగ్గుతున్నాయి. ఇటీవల వచ్చిన భాయ్ చిత్రంలో ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించింది.

  English summary
  It was said that Kamna married secretly but the gossip spread very fast. It also murmured that the groom met Kamna during the CCL after party events and from then on it was a cupid strike. As per the sources, the entire event went on secretly as a private affair where a very few of their near & dear ones have attended. Few of her close friends Poonam Bazwa and Meenakshi dixit has said to be graced the event.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more