»   »  వరుణ్ తేజ్ ‘కంచె’ హాలీవుడ్ సినిమాకు కాపీనా?

వరుణ్ తేజ్ ‘కంచె’ హాలీవుడ్ సినిమాకు కాపీనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో పలు తెలుగు సినిమాలు హాలీవుడ్ సినిమాలను పోలి ఉన్నాయనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కంచె' చిత్రంపై కూడా ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

‘కంచె' సినిమా హాలీవుడ్ మూవీ ‘డియర్ జాన్' సినిమా నుండి ఇన్స్‌స్పైర్ అయి తీసిన సినిమా అని, ఇటీవల విడుదలైన ‘కంచె' సినిమా పోస్టర్లు, టీజర్ కూడా ‘డియర్ జాన్' సినిమాను పోలి ఉందనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఆరోపణల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

ఇప్పటికే విడుదైలైన ‘కంచె' ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. స్టన్నింగ్ విజువల్స్ తో ఆకట్టుకునే విధంగా ఉన్నాయనే టాక్ వచ్చింది. ‘కంచె ట్రైలర్ స్టన్నింగ్ గా ఉంది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్' అంటూ కూడా మహేష్ బాబు ట్వీట్ చేసారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో కూడా ‘కంచె' టీజర్ ను చూసి మెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Kanche Inspired from Dear John?

ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎవరూ చిత్రీకరించని రెండవ ప్రపంచ యుద్ధ పోరాట సన్నివేశాలు ‘కంచె' చిత్రానికి స్పెషల్ హైలైట్ గా నిలుస్తాయి. జార్జియా దేశం లో, రియల్ వరల్డ్ వార్ 2 వెపన్స్ , యుద్ధ ట్యాంక్స్ , యూనిఫాం, లొకేషన్స్‌ను వాడుకుని, భారీ వ్యయం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

బాలీవుడ్ లో ఇటివలే ‘గబ్బర్' చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. భారీ వ్యవయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

English summary
A section of viewers who watched the teaser called ‘Kanche’ as heavily inspired from Hollywood film ‘Dear John.’ Even the first look posters are also said to be almost similar to ‘Dear John.’
Please Wait while comments are loading...