»   » విమానంలో స్టార్ కమెడియన్ వీరంగం... మరో కమెడియన్‌పై దాడి?

విమానంలో స్టార్ కమెడియన్ వీరంగం... మరో కమెడియన్‌పై దాడి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హిందీ టీవీ ఛానల్స్ లో కపిల్ శర్మ కామెడీ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియాలో హయ్యెస్ట్ రేటింగ్ సంపాదించుకుంటున్న కామెడీ షోలలో ఇదీ ఒకటి. ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న ఈ షో ప్రస్తుతం 'కమిల్ శర్మ షో' పేరుతో ప్రసారం అవుతోంది.

తాజాగా కపిల్ శర్మ... అనేహ్యమైన కారణాలతో వార్తల్లోకి ఎక్కాడు. తనతో పాటు కామెడీ షోలు చేసే సునీల్ గ్రోవర్ మీద కపిల్ శర్మ దాడి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విమాన ప్రయాణంలో ఉండగా అతడు ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

 ఆస్ట్రేలియా నుండి ముంబైకి విమానంలో వస్తుండగా.....

ఆస్ట్రేలియా నుండి ముంబైకి విమానంలో వస్తుండగా.....

ఇటీవల కపిల్ శర్మ, సునీల్ గ్రోవర్ ఆస్ట్రేలియా నుండి ముంబైకి విమానంలో వస్తుండగా..... కపిల్ శర్మ ఆగ్రహంతో ఊగిపోతు, అరుస్తూ సునీల్ గ్రోవర్ మీద దాడి చేసాడని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

బూతులు తిడుతూ, భౌతిక దాడి

బూతులు తిడుతూ, భౌతిక దాడి

కారణం ఏమిటో తెలియదని.... కపిల్ శర్మ బూతులు తిడుతూ, భౌతిక దాడికి పాల్పడ్డాడని అదే విమానంలో ప్రయాణిస్తున్న కొందరు మీడియాకు వెల్లడించారు. మరి ఈ గొడవకు కారణం ఏమిటి? కపిల్ శర్మ ఏకంగా విమానంలో అందరూ చూస్తుండగా సహనం కోల్పోయి ఇలా చేయడానికి కారణం ఏమిటి? అనేది చర్చనీయాంశం అయింది.

కారణం ఏమిటో?

కారణం ఏమిటో?

అయితే ఈ విషయమై దాడి చేసిన కపిల్ శర్మ గానీ, ఇటు దాడికి గురైన సునీల్ గ్రోవర్ గానీ స్పందించడం లేదు. కొందరు బాలీవుడ్ మీడియా ప్రతినిధులు వారిని ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసినా అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది.

కాబోయే ఆవిడ

కాబోయే ఆవిడ

ఆ గొడవ సంగతి పక్కన పెడితే కపిల్ శర్మ త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ గిని చత్రత్ ను పెళ్లాడబోతున్నాడు. ఇటీవలే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.

English summary
Strong rumors are doing rounds that Kapil in an inebriated condition beaten up another star comedian Sunil Grover when both were returning on a flight from Australia to Mumbai Thursday night. Kapil allegedly physically assaulted his colleague Grover, an eye witness traveling on in the flight said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu