»   » అతడు లేకుండా... ‘బాహుబలి-2’ భారీ విజయం సాధ్యమేనా?

అతడు లేకుండా... ‘బాహుబలి-2’ భారీ విజయం సాధ్యమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-ది బిగినింగ్ సినిమా ఎవరూ ఊహించని భారీ విజయం సాధించి. ఈ సినిమా మొత్తం రూ. 650 కోట్లు వసూలు చేస్తే... అందులో ఎక్కువ మొత్తం హిందీ వెర్షన్ నుండే వచ్చాయి. సౌత్ సినిమాలు హిందీలో పెద్దగా ఆడవు. కానీ బాహుబలి హిందీ వెర్షన్ అంత పెద్ద విజయం సాదించింది అంటే ప్రధాన కారణం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్... కరణ్ జోహార్ అని చెప్పక తప్పదు.

ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో నిర్మాత రాజమౌళి కూడా స్వయంగా ఒప్పుకున్నారు. కరణ్ జోహార్ ఈ సినిమాను ప్రమోట్ చేయడం వల్లే మంచి పబ్లిసిటీ లభించి పెద్ద హిట్టయింది. 2017లో రాబోతున్న బాహుబలి-2 సినిమా కూడా ఆయనే రిలీజ్ చేస్తారని అంతా అనుకుంటున్నా.... ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా జరుగదేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


ఆలోచనలో పడ్డ కరణ్ జోహార్

ఆలోచనలో పడ్డ కరణ్ జోహార్

బాహుబలి-2 హిందీ వెర్షన్ రైట్స్ కు నిర్మాతలు భారీ రేటు చెబుతుండటంతో అంత పెద్ద మొత్తం పెట్టి రిస్క్ చేసేందుకు కరణ్ జోహర్ సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతోంది. ఈ డీల్ విషయంలో బాహుబలి నిర్మాతలకు, కరణ్ జోహార్ కు మధ్య చర్చలు నడుస్తున్నాయట.


పోటీ పడుతున్న ప్రముఖ నిర్మాణ సంస్థలు

పోటీ పడుతున్న ప్రముఖ నిర్మాణ సంస్థలు

బాహుబలి పార్ట్ 1 భారీ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ రైట్స్ దక్కించుకునేందుకు పలు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వారు ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తుండటం, కరణ్ జోహార్ అంత మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా లేక పోవడంతో ఎటూ తేల్చుకోలేక పోతున్నారట నిర్మాతలు.


అతడు లేకుండా బాహుబలి-2 భారీ విజయం సాధ్యమేనా?

అతడు లేకుండా బాహుబలి-2 భారీ విజయం సాధ్యమేనా?

అయితే కరణ్ జోహార్ లేకుండా బాహుబలి-2 భారీ విజయం సాధించడం సాధ్యమేనా? వేరే వారి చేతికి సినిమా రైట్స్ ఇస్తే ఆశించిన ఫలితాలు రాక పోవచ్చు అనే మీమాంసలో పడ్డారు నిర్మాతలు.


బాహుబలి-2 : దిల్ రాజును ఎందుకు తప్పించారు? కావాలనే చేసారా

బాహుబలి-2 : దిల్ రాజును ఎందుకు తప్పించారు? కావాలనే చేసారా

బాహుబలి-2 : దిల్ రాజును ఎందుకు తప్పించారు? కావాలనే చేసారా?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
Film Nagar source said that, Karan is now still in contemplation mode about acquiring Baahubali: The Conclusion given its staggering price.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu