»   » అదే నిజమైతే.... మహేష్ బాబు ‘స్పైడర్’పై వందల కోట్ల వర్షమే!

అదే నిజమైతే.... మహేష్ బాబు ‘స్పైడర్’పై వందల కోట్ల వర్షమే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం 'స్పైడర్'. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేయబోతున్నారు.

తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం ఈ చిత్రం హిందీ రిలీజ్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ చేతికి వెళ్లినట్లు సమాచారం. నైజాంలో దిల్ రాజు బేనర్ కు ఎంత పేరుందో బాలీవుడ్లో కరణ్ జోహార్ బేనర్‌కు అంతే పేరుంది. అందుకే హిందీలో భారీ వసూల్లు రాబట్టాలనే ఉద్దేశ్యంలో కరణ్ జోహార్ కు ఈ చిత్రం హిందీ హక్కులు అప్పగించినట్లు సమాచారం.


బాహుబలి-కరణ్ జోహార్

బాహుబలి-కరణ్ జోహార్

బాహుబలి, బాహుబలి-2 చిత్రాలను కరణ్ జోహార్ హిందీలో గ్రాండ్ స్కేల్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి-2 సినిమాకు రూ.1500 కోట్లు వస్తే... అందులో రూ. 500 కోట్లు హిందీ నుండే వచ్చాయి. బాలీవుడ్ పరిశ్రమలో కరణ్ జోహార్‌ నెట్వర్క్ ఏ రేంజిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.


కరణ్ జోహార్- స్పైడర్

కరణ్ జోహార్- స్పైడర్

కరణ్ జోహార్ చేతికి స్పైడర్ హిందీ రిలీజ్ హక్కులు వెళితే సినిమాను మరింత భారీగా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందని, తద్వారా భారీ వసూళ్లు సాధించడానికి వీలుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు.


300 కోట్లు అంచనా...

300 కోట్లు అంచనా...

మహేష్ బాబు స్పైడర్ మూవీ హిందీ, తమిళం, తెలుగు ఈ మూడు భాషల్లో కలిపి కనీసం రూ. 300 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగానే భారీగా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


టీజర్ సౌతిండియా రికార్డ్

టీజర్ సౌతిండియా రికార్డ్

ఇప్పటికే విడుదలైన ‘స్పైడర్' ఫస్ట్ లుక్, టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. టీజర్‌ ఒక్క రోజులోనే 6.3 మిలయన్ వ్యూస్ సాధించి సౌతిండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.English summary
Karan applauding the trailer of Mahesh Babu’s upcoming film SPYder. He wrote: “This is looking extremely intriguing!!! Can’t wait to see more….all the best”. This created a buzz on the internet that Karan could be having a plan of taking the distribution of this film too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu