»   » రూ. 150 కోట్లతో ప్రభాస్‌ డేట్స్ కొనేశాడా? ఎవరా నిర్మాత?

రూ. 150 కోట్లతో ప్రభాస్‌ డేట్స్ కొనేశాడా? ఎవరా నిర్మాత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాహుబలి తర్వాత బాలీవుడ్లో ప్రభాస్ మీద భారీ క్రేజ్ ఏర్పడింది.ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ నిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే తాను ఉండగా ఆ అవకాశం ఎవరీ దక్కనివ్వను అనే మైండ్ సెట్‌తో ఉన్న ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రభాస్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం ప్రభాస్‌, రానాతో పలువురు బాలీవుడ్ స్టార్లను పిలిచి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసిన కరణ్ జోహార్ ఈ సందర్భంగా ప్రభాస్‌తో డీల్ ఫైనల్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రూ. 150 కోట్ల డీల్?

రూ. 150 కోట్ల డీల్?

ఈ డీల్ ప్రకారం కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నుండి ప్రభాస్ రూ. 150 కోట్ల భారీ అమౌంట్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ కెరీర్లోనే ఇది అతిపెద్ద డీల్ అని అంటున్నారు.

ఎన్ని ప్రాజెక్టులు?

ఎన్ని ప్రాజెక్టులు?

అయితే ఈ 150 కోట్ల డీల్ ద్వారా.... ధర్మ ప్రొడక్షన్స్ తరుపున ప్రభాస్ 3 సినిమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ డీల్ గురించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

యూఎస్ఏ టూర్లో ఉన్నపుడే

యూఎస్ఏ టూర్లో ఉన్నపుడే

ప్రభాస్ గత నెలలో యూఎస్ఏ టూర్లో ఉన్నపుడే కరణ్ జోహార్ నుండి ఈ డీల్ ప్రపోజల్ వచ్చిందని, ప్రభాస్ నుండి సుముఖత రావడంతో అతన్ని పిలిచి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చి డీల్ ఫైనల్ చేశారని అంటున్నారు.

త్వరలో అనౌన్స్‌మెంట్

త్వరలో అనౌన్స్‌మెంట్

ప్రస్తుతం ప్రభాస్‌తో చేయడానికి కథలు ఏవీ సిద్ధంగా లేవని, కథలు సిద్ధమైన తర్వాత ప్రభాస్ హీరోగా కరణ్ జోహార్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

చైనా టూర్

చైనా టూర్

బాహుబలి-2 చిత్రాన్ని జులై నెలలో చైనాలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ చిత్రం భారీగానే వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. చైనాలో ఈ చిత్రాన్ని కరణ్ జోహారే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. రాజమౌళి, ప్రభాస్ ను తీసుకుని చైనాలో ప్రమోషన్స్ నిర్వహించేందుకు కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ప్రభాస్ ‘సాహో'

ప్రభాస్ ‘సాహో'

ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో‘సాహో' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మళయాలం, హిందీలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిందీలో ‘సాహో' చిత్రాన్ని కూడా కరణ్ జోహార్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

English summary
Bollywood inform us that Karan Johar has now made Prabhas to agree to his proposal. There soon will be an official announcement regarding this. As per the deal, Karan Johar will be producing two big-budgeted Bollywood movies with Prabhas as hero. The Baahubali star will be receiving more than Rs 150 Cr from Dharma Productions, Karan Johar's production firm.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu