బిగ్‌బాస్‌లో మరో రచ్చ.. దీప్తికి న‌కిలీ ఓట్లు.. కౌశల్ ఆర్మీ తీవ్ర ఆరోపణలు

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Kaushal Army Blames Deepthi's Voting Count

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొంటున్న సెలబ్రిటీలకు ఇప్పుడు సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రాణంగా మారింది. ప్రేక్షకుల ఓట్ల వారికి ఊపిరిగా మారాయి. బిగ్‌బాస్‌కు ముందే కౌశల్ సోషల్ మీడియా క్యాంపెన్‌ను భారీగా సెటప్ చేసుకొని లోనికి వెళ్లాడనే ఆరోపణలు వస్తున్నాయి. కౌశల్ ఆర్మీ బిగ్‌బాస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ నేపథ్యంలో కౌశల్ ఆర్మీ తీవ్ర ఆరోపణలు చేసింది. అసలేం జరగుతున్నదంటే..

 బలమైన అభ్యర్థిగా కౌశల్

బలమైన అభ్యర్థిగా కౌశల్

బిగ్‌బాస్ హౌస్‌లో కౌశల్ బలమైన ప్రత్యర్థిగా మారాడు తోటి సెలబ్రిటీలకు. దాదాపు అన్ని వారాలు నామినేట్ అయినప్పటికీ కౌశల్ చాలా సులభంగా బయటపడుతున్నాడు. అందుకు కారణం బలమైన కౌశల్ ఆర్మీనే. కౌశల్ ఆర్మీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలున్న ప్రతీచోట బలంగా పనిచేస్తున్నది.

కౌశల్ ఆర్మీ రంగ ప్రవేశం

కౌశల్ ఆర్మీ రంగ ప్రవేశం

బిగ్‌బాస్ సెలబ్రిటీ కౌశల్‌కు మద్దతుగా ఓటింగ్ చేస్తూ అతడిని ఫైనల్‌ వరకు లాక్కొచ్చింది. కేవలం ఓటింగ్ మాత్రమే కాకుండా 2కే రన్, తదితర కార్యక్రమాలు చేపడుతూ కౌశల్‌కు మద్దతు కూడగడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కౌశల్ ఆర్మీ తీవ్ర ఆరోపణలు చేసింది.

దీప్తి నల్లమోతుకి నకిలీ ఓటింగ్

దీప్తి నల్లమోతుకి నకిలీ ఓటింగ్

బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ దీప్తికి న‌కిలీ ఓటింగ్ జ‌రుగుతున్నది. బ‌య‌ట పెద్ద‌గా ఫాలోయింగ్ లేక‌పోయినా కొద్ది వారాలుగా ఆమె ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది. రామ్ సొల్యూషన్స్‌ అనే డిజిటల్ మీడియా కంపెనీ సహకారం తీసుకొంటున్నది. సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు, జీమెయిల్ ద్వారా ఓట్లు వేయించుకుంటున్నది అని ఆరోపణలు చేశారు.

 అవి నకిలీ ఓట్లేనని కౌశల్ ఆర్మీ వాదన

అవి నకిలీ ఓట్లేనని కౌశల్ ఆర్మీ వాదన

అంతేకాకుండా మరో వాదనను కూడా కౌశల్ ఆర్మీ సభ్యులు వినిపిస్తున్నారు. కౌశల్‌కి మంగళవారం ఉదయానికి 80 వేల దాకా ఓట్లు పోల్ కాగా, దీప్తికి పదుల్లో ఓట్లు పోల్ అయ్యాయి. కానీ మంగళవారం ఉదయం మాత్రం భారీగా ఓటింగ్ జరిగింది. అందుకు కారణం నకిలీ అకౌంట్లే అని కౌశల్ ఆర్మీ దుయ్యబట్టింది. అయితే దీప్తికి నకిలీ ఓట్ల వ్యవహారంలో ఎంత నిజముందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X