»   »  వైఎస్ఆర్ బయోపిక్: వైఎస్ జగన్ భార్య పాత్రలో ఆ హీరోయిన్?

వైఎస్ఆర్ బయోపిక్: వైఎస్ జగన్ భార్య పాత్రలో ఆ హీరోయిన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఎట్టకేలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి యాత్ర మొదలవుతోంద

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రను మళయాల నటుడు మమ్ముట్టి పోషించనున్నాడు. దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి 70ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ప్రచారంలోకి కీర్తి సురేష్ పేరు

ప్రచారంలోకి కీర్తి సురేష్ పేరు

‘యాత్ర' మూవీకి సంబంధించి తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ పేరు ప్రచారంలోకి వచ్చింది. చిత్ర దర్శక నిర్మాతలు ఇటీవలే ఆమెను సంప్రదించారని, ఈ చిత్రంలో ఆమెతో వైఎస్ జగన్ భార్య భారతి పాత్రను చేయించడానికి ట్రై చేస్తున్నారని టాక్.

త్వరలో పూర్తి వివరాలు

త్వరలో పూర్తి వివరాలు

ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, టెక్నీషియన్స్, ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. అన్నికంటే ముఖ్యంగా ఈ చిత్రంలో వైఎస్ జగన్ పాత్రను ఎవరు పోషిస్తున్నారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

 వైఎస్ జీవితంలోని కొన్ని సంఘటనలే

వైఎస్ జీవితంలోని కొన్ని సంఘటనలే

వైఎస్ఆర్ పాత్ర‌లో న‌టించ‌డానికి మమ్ముట్టి అంగీకరించడం చాలా ఆనందం క‌లిగిందని, రెండు రాష్ట్రాల ప్రజలు ఆరాదించే నాయకుడు, ఎమోషనల్ గా ప్రజలకు దగ్గరైన వ్యక్తి వైయస్. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటన‌ల‌ ఆధారంగా భారీ బడ్జెట్ తో ఎమెష‌న‌ల్ కంటెంట్‌ గా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు కొన్ని ముఖ్యఘట్టాలు, పాద యాత్ర లాంటి వాటిని ప్రధానంగా ఫోకస్ చేస్తారని తెలుస్తోంది.

 రూ. 30 కోట్లకుపైగా బడ్జెట్

రూ. 30 కోట్లకుపైగా బడ్జెట్

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్ ఎస్టిమేషన్స్‌తో సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 2019 సంక్రాంతిలోపు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
As Malayalam Superstar Mammootty has already given his nod to reprise the role of former CM YS Rajasekhara Reddy in his biopic. The latest we hear is that reigning South heroine, Keerthy Suresh has been approached to play the role of YSR's daughter-in-law and Jagan's wife, YS Bharati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X