For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  శృతి హాసన్ పై హీరో భార్య నిఘా...అందుకే

  By Srikanya
  |

  ముంబయి: గబ్బర్ సింగ్ తో గోల్డెన్ లెగ్ గా మారిన శృతి హాసన్ రీసెంట్ గా జరిగిన ఓ సంఘటనతో మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యింది. ఆ సంఘటన మరేదో కాదు...ఓ అగంతకుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయటం...విఫలమవటం..పోలీసులకు చిక్కటం. అయితే ఈ సంఘటన ఇక్కడితో ఆగిపోతే బాగుండేది. ఈ సంఘటనకు మూలం అంటూ మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అది ఆ సంఘటనకు కారణం.. ఓ హీరో భార్య అని తెలవటం.

  బాలీవుడ్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం...ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఆ అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించబోయిన సమయంలో శ్రుతితో పాటు ఆ ఇంట్లో ఓ హీరోగారు ఉన్నారని. అలాగే ఆయన ఓ 'ఖాన్' అని చెప్తున్నారు. దాంతో ఆ హీరోగారి భార్యే ఈ విషయం గుట్టు బయిటపెట్టడానికి ఈ ప్లాన్ వేసిందని చెప్పుకుంటున్నారు. అయితే ఇది నిజమా కాదా అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయంపై కమల్ మాజీ బార్య...శృతి తల్లి సారిక మాట్లాడారు. ఆమె ఇటువంటి సంఘటన దురదృష్టకరమని,అలాంటివి జరగకుండా చూసుకోవాలని అన్నారు.

  ఇక శృతి హాసన్‌పై ఇటీవల ముంబైలోని తన అపార్టుముంటులో ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. సిసి టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసారు. నిందితుడు అశోక్ శంకర్ త్రిముఖే(45)గా గుర్తించారు. అతడు ఫిల్మ్ సిటీలో స్పాట్ బాయ్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు.

  తాను సోదరుడికి ఉద్యోగం కోసం శృతి హాసన్ ఇంటికి వెళ్లాలని.. తాను చెప్పడానికి ప్రయత్నిస్తుండగానే ఆమె డోర్ వేసేశారని అశోక్ శంకర్ పోలీసులకు చెప్పాడు. అంతేకానీ, ఆమెను బెదిరించాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పాడు. అయితే అశోక్ శంకర్ త్రిముఖే వాదనను శృతి హాసన్ ఖండించారు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో వరుసగా అవకాశాలు అందుకుంటున్న శ్రుతి ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'రేసుగుర్రం'లో నటిస్తోంది. త్వరలో 'ఎవడు'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  పోలీసులకు అశోక్ శంకర్ త్రిముఖే చెప్పేది అవాస్తవమని, ఒంటరిగా ఒక ఆడపిల్ల ఉంటున్న పార్టుమెంటులోకి రాత్రి 9.30 గంటలకు రావాల్సిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అతడు అనేక సందర్భాల్లో సినిమా సెట్లలో కనిపించాడని, అప్పుడెప్పుడూ తనతోగానీ, తన సిబ్బందితో గానీ అతని సోదరుడి ఉద్యోగం గురించి ఎందుకు మాట్లాడలేదని, దురుద్దేశంతోనే తన ప్లాటుకు వచ్చాడనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలనే విధంగా శృతి హాసన్ స్పందించారు

  English summary
  A stalker's attack on actress Shruti Hassan at her Bandra residence in Mumbai has created quite stir in the media, but her Superstar father Kamal Hassan and actress-mother Sarika kept mum on this issue, which had surprised many in the industry.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more