మరోసారి మెగా హీరోతో జోడీ కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ
గద్దలకొండ గణేష్ (వాల్మీకి) చిత్రంతో భారీ హిట్టు కొట్టిన వరుణ్ తేజ్.. ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో ప్రేక్షకులను పలకరించిన వరుణ్.. వాల్మీకిగా మరోసారి ఆడియెన్స్‌ను మెప్పించాడు. మెగా హీరోలందరిలోనూ తన కంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. వాల్మీకి ఇచ్చిన ఊపులో కొత్త ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టేస్తున్నాడు. ఇటీవలె బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఓ చిత్రాన్ని ప్రారంభించేశాడు.
ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచిన కియారా అద్వాణీ వరుణ్ తేజ్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కియారా అద్వాణీ బాలీవుడ్ అందాల తారగా ఒక వెలుగు వెలుగుతోంది. వరుసగా హిందీ సినిమాలు చేస్తూనే, 'భరత్ అనే నేను' .. 'వినయ విధేయ రామ' సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అలాంటి కైరా అద్వాని తాజాగా మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ బాక్సింగ్ నేపథ్యంలో సినిమాను నిర్మించనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించే ఈ మూవీ కోసం వరుణ్ శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం కైరాను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.


Click it and Unblock the Notifications











