»   » కట్టుకున్నోడు వదిలేశాడు.. కష్టాల్లో కిమ్ శర్మ.. మరొకరితో సహజీవనం!

కట్టుకున్నోడు వదిలేశాడు.. కష్టాల్లో కిమ్ శర్మ.. మరొకరితో సహజీవనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌తోపాటు, టాలీవుడ్ చిత్రాల్లోనూ కూడా సినీనటి కిమ్ శర్మ తన అంద చందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఖడ్గం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు ఒకప్పటి క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రియురాలు. ఆ తర్వాత కెన్యాకు చెందిన పారిశ్రామిక దిగ్గజం అలీ ఫుంజానీని కిమ్ శర్మ వివాహం చేసుకొన్నది. వ్యక్తిగత అభిప్రాయ బేధాల కారణంగా ప్రస్తుతం వారి వైవాహిక జీవితం ఇబ్బందిలో పడింది. అయితే ఈ వీరి మధ్య గొడవల వెనుక మరో కోణం దాగి ఉన్నదనే రూమర్ బలంగా వినిపిస్తున్నది. మరో మహిళ వ్యామోహంలో పడి కిమ్ శర్మను పుంజానీ వదిలివేసినట్టు సమాచారం.

కెన్యా పారిశ్రామిక వేత్తతో పెళ్లి..

కెన్యా పారిశ్రామిక వేత్తతో పెళ్లి..

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో జోరు మీద ఉన్నప్పుడే కిమ్ శర్మ, అలీ పుంజానీకి 2010లో వివాహమైంది. కేవలం వారం రోజులపాటు డేటింగ్ చేసిన వెంటనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత సినీ అవకాశాలు వదిలేసి పుంజానీతో కలిసి కెన్యాకు వెళ్లి పోయింది. ప్రస్తుతం పుంజానీ వదిలి వేసిన తర్వాత ముంబై నగరంలోని తన అపార్ట్‌మెంట్‌లో కొద్ది నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా ఉంటున్నట్టు తెలిసింది.

మరో మహిళతో మోజు..

మరో మహిళతో మోజు..

కిమ్ శర్మ, అలీ విడిపోవడానికి కారణం అతను మరో మహిళ ప్రేమలో పడటమేనట. కిమ్‌ను కలిసిన సమయంలో అలీ లావుగా ఉండేవాట. ప్రస్తుతం అలీ సన్నపడటంతోపాటు అందంగా తయారయ్యాడట. ప్రస్తుతం అలీ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకొని కిమ్‌ను కట్టుబట్టలతో వదిలి వేసినట్టు తెలుస్తున్నది. అలా కెన్యా నుంచి వచ్చిన కిమ్ శర్మ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయినట్టు సమాచారం.

మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు..

మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు..

ఆర్థికంగా పుంజుకోవడం కోసం ముంబైలో వ్యాపారాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తున్నది. కిమిశర్మ పేరుతో ఓ బ్రాండ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉందట. పుంజానీతో ఉన్నప్పడు ఆయన హోటల్స్ వ్యాపారానికి సీఈవోగా వ్యవహరించేంది. ఆ అనుభవంతోనే వ్యాపారంలో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమవుతున్నది.

మరో వ్యాపారవేత్తతో కిమ్ అఫైర్

మరో వ్యాపారవేత్తతో కిమ్ అఫైర్

ఇదిలా ఉండగా, ముంబైలో ఉంటున్న కిమ్ శర్మ తాజాగా ఓ వ్యాపార వేత్త అర్జున్ ఖన్నాతో అఫైర్ సాగిస్తున్నట్టు సమాచారం. వీరద్దరూ కలిసి తిరుగుతుండగా పలు మార్లు మీడియా కంటపడ్డారు కూడా. అర్జున్ ఖాన్నా దాంపత్య జీవితం వివాదాల్లో పడింది. ఆయన తన భార్య షిఫాలీకి దూరంగా ఉంటున్నాడు. అలీ పుంజానీ వదలి పెట్టాక దూరంగా ఉంటున్న కిమ్, అర్జున్ ఖన్నాలిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు రూమర్లు తెగ ప్రచారమవుతున్నాయి.

యువరాజ్ సింగ్‌తో పీకల్లోతు..

యువరాజ్ సింగ్‌తో పీకల్లోతు..

అలీ పుంజానీతో పెళ్లికి ముందు క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. దాదాపు వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు వచ్చింది. అయితే వారిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కిమ్ శర్మతో పెళ్లికి యువరాజ్ సింగ్ తల్లి విలన్‌గా మారినట్టు వార్తలు కూడా వచ్చాయి.

ఖడ్గం, మగధీర చిత్రాల్లో..

ఖడ్గం, మగధీర చిత్రాల్లో..

బాలీవుడ్‌లో ప్రవేశించకముందు తొలిసారి క్లోజప్ టూత్ పేస్ట్‌కు మోడల్‌గా పనిచేసింది. ఆ తర్వాత బిజీగా మారిన ఆమె సన్ సిల్క్, పెప్సీ, టాటా సఫారీ, పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, క్లీన్ అండ్ క్లీన్, లిరిల్ వ్యాపార ప్రకటనలో కనిపించింది. 1993లో డర్ చిత్రంలో చిన్నపాత్రతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆదిత్య చోప్రా రూపొందించిన మొహబ్బతే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ఖడ్గం, అంజనేయులు, మగధీర చిత్రాల్లో కనిపించింది.

English summary
Kim Sharma’s marriage to Kenyan business tycoon Ali Punjani is over. The actress has been in Mumbai for the last few months holed up in her sprawling suburban apartment. ever since her return from Kenya, Kim has been linked to menswear designer Arjun Khanna and has even been clicked with him on several occasions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu